ధర్మం
ధర్మం
దశ 1 :
- సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
- మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
- మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
- కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.
దశ 2 :
ఇప్పుడు మీ శ్వాసపై ఎఱుకను కలిగి ఉండండి. మీ ఊపిరితిత్తుల నిండా దీర్ఘ శ్వాసను తీసుకోండి. తగినంత సమయం తీసుకుని మెల్లగా బయటికి వదలండి. కళ్ళను నెమ్మదిగా మూయండి.
మీరు శ్వాసను లోపలికి తీసుకుంటున్నప్పుడు స్వచ్ఛమైన గుణనివారణ శక్తి (హీలింగ్ పవర్) మీ లోపలికి ప్రవేశించినట్లుగా ఊహించుకోండి. ఆ శక్తి మీలో ఆనందాన్ని, ప్రేమను, శాంతిని నింపుతున్నట్లుగా భావించండి. శ్వాసను బయటికి వదులుతున్నప్పుడు మీకు అసౌకర్యాన్ని కలిగించే గుణాలైన విచారము, అలసట, కోపము, చిరాకు, భయము, విసుగు, అసూయ వంటివి బయటికి వెళ్తున్నట్టుగా భావించండి. మీరు సంతోషంగా ఎటువంటి చింతలు లేకుండా ఉన్నట్టుగా ఊహించుకోండి. ఇలా మూడు నాలుగు పర్యాయములు చేసినచో, మిమ్మల్ని ఆందోళనపరచే విషయములు అన్ని ఒక్కొక్కటి దూరంగా వెళ్లిపోతాయి.
దశ 3 :
మీ తలపై మూడు అంగుళాల తెల్లటి కాంతితో కూడిన జలపాతాన్ని ఊహించుకోండి.
అది మీ చుట్టూ ప్రవహిస్తున్నట్లుగా అనుభూతి చెందండి, అది చాలా స్పష్టంగా, మెరుస్తూ వుంది. అది మీ గుండా ప్రవహిస్తున్నట్లు ఊహించుకోండి, ఏవైనా అసౌకర్య భావాలు వుంటే వాటిని కడిగివేస్తుంది. ఇది మీకు చల్లగా మరియు తాజాగా అనిపిస్తుంది… మీ తల గుండా ప్రయాణిస్తున్నప్పుడు, మీ తలలో ఇబ్బంది కలిగించే ఆలోచనలను కడిగి వేస్తుంది. మీ ఛాతీ మరియు హృదయ భాగం ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు మీకు మంచి ఆరోగ్యాన్ని మరియు శ్రద్ధ గల దృక్పథాన్ని అందిస్తుంది. మీ చేతులు మరియు అరచేతుల ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు, అవి ఇతరులకు సహాయాన్ని అందించే దిశగా వెళ్ళేలా చేస్తుంది. మీ పొట్ట ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు మీరు తీసుకునే ఆహారంలో శుభ్రమైనవి మరియు తాజావి తీసుకునే శ్రద్ధను కలుగ చేస్తుంది. మీ కాళ్లు మరియు పాదాల ద్వారా ప్రయాణించిప్పుడు, అవి మరింత దృఢంగా అయ్యి, ఇతరులకు సహాయపడే దిశగా ప్రయాణిస్తాయి. మెరుస్తున్న ఆ తెల్లని కాంతి మీలో ప్రవహించినది కనుక మీరు చాలా సంతోషంగా సంతృప్తిగా ఉంటారు. మీరు మంచి పనులు చేసే ఉత్తమమైన వ్యక్తి అని తెలుసుకోండి.
దశ 4 :
ఇప్పుడు దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి. కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.
[BISSE Ltd శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధని ఆధారంగా.]