నీరు
నీరు
ప్రియమైన పిల్లలూ,
మీ చేతులు పైకి చాపండి. కిందికి దించండి.
ఇప్పుడు భగవంతుని యొక్క సృష్టి అందాలను మెచ్చుకుంటూ, చిరునవ్వుతో హాయిగా కొద్ది సేపు విశ్రాంతి తీసుకోండి.
ప్రకృతిలోని పంచభూతాల్లో నీరు ఒకటి. అది భగవంతుని సృష్టి. నీరు శబ్ద,స్పర్శ,రూపం రుచి అనే నాలుగు గుణాలు, కలిగి ఉంటుంది. నీరు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. దాన్నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే,మనం ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ ఏదైనా పని చేస్తూ ఉండాలి.ఇతరులకు సహాయం చేస్తుండాలి.అదే అందరి మధ్య సామరస్యాన్ని కలిగిస్తుంది.
కళ్ళు మూసుకొని మీరు గడిపిన ఈరోజును ఊహించుకోండి.
నువ్వు పొద్దున్నే లేచావు,స్వామిని ప్రార్థించావు. పళ్ళు తోముకున్నావు. బాత్రూమ్ కి వెళ్లావు. పాలు తాగావు. స్నానం చేశావు. మీ అమ్మగారు నీ బట్టలన్నీ ఉతికారు. మీ పనివారు పాత్రలు శుభ్రం చేశారు. మీ నాన్న మొక్కలకు నీళ్లు పోశారు. చేతులు కాళ్లు నీళ్లతో కడుక్కున్నారు. నీళ్ల సహాయంతో,మీరంతా టిఫిన్ సిద్ధం చేసుకున్నారు . మీరు చేసిన ఈ పనులన్నీ నీటితో మాత్రమే చేయగలరు. ఓ నా పిల్లలూ, నీరు లేకుండా మనం ప్రపంచంలో ఉండలేం. మన దాహాన్ని తీర్చడానికి,నీటిని సృష్టించిన దేవునికి మనం కృతజ్ఞతలమై ఉండాలి. మనం,నీటిని వృధా చేయరాదు. ప్రతి చుక్కను ఆదా చేయాలి. అద్భుతమైన నీరు అనే బహుమతిని ఇచ్చిన దేవునికి ధన్యవాదాలు.
మెల్లగా తిరిగివచ్చి ఈ మాటలు చెప్పండి.
నీరు…నీరు నీరు.
దేవుడు నీటి సృష్టికర్త.
నీరు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది.
నీటిని ఎప్పుడూ పవిత్రంగా ఉంచుతానని, వాగ్దానం చేస్తున్నాను.
తరగతి గది చర్చ:
జీవనోపాధి యొక్క మార్గము – నీటి నుండి పాఠాలు.
నీటిని వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం. దాహం తీర్చుకోవడానికి, స్నానం చేయడానికి, వస్తువులు శుభ్రం చేయటానికి, మొక్కలు పెంచడానికి. జలపాతాలు నదీ తీరాలు చూసి, విశ్రాంతి అనుభవించడానికి. మనకి నీరు అత్యంత అవసరం. మనం అందరం, నీటిలా స్వచ్ఛంగా, సౌమ్యంగా ఉండాలి. ఇతరులు ఎదగడానికి సహాయం చేయాలి. ఎక్కడ ఉన్నా, ఆనందాన్నిపంచాలి.
ప్రశ్నలు:
- నీటి రంగు ఏమిటి?
- నీటి ఆకారం ఏమిటి?
- నీటి ఉపయోగాలు ఏమిటి?
[Ref: ‘Silence to Sai-lens’- A Handbook for Children, Parents and Teachers by Chithra Narayan & Gayeetree Ramchurn Samboo MSK – A Institute of Sathya Sai Education – Mauritius Publications]