విజ్ఞానము – ఆత్మనిగ్రహము
విజ్ఞానము – ఆత్మనిగ్రహము
ఒకనాటి రాత్రి జన సమ్మర్ధము బాగా ఉన్న రహదారిలో సైకిల్ పై ప్రయాణిస్తున్న యువకుని కథ ఇది. అక్కడ విధి నిర్వహణలో ఉన్న రక్షక భటుడు (police) అతనిని లైట్ లేనందున సైకిల్ ఆపి దిగమన్నాడు.
ఆ యువకుడు “పోలీస్ గారూ! దూరంగా వెళ్ళండి. నా సైకిల్ కి లైటే కాదు బ్రేక్ లు కూడా లేవు ” అని గట్టిగా అరిచాడు.
ఈనాడు ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంది. ఎవ్వరి వద్ద విజ్ఞానమనే లైట్ కానీ ఆత్మనిగ్రహమనే బ్రేక్ లు కానీ లేవు. ఇవి లేకుండా ఆనందమనే రహదారి వెంట తనకు గానీ, ఇతరులకు కానీ గాయాలు కాకుండా ప్రయాణించడం ఎలా? సైకిల్ నడిపే వారికి లైట్, బ్రేక్ లు ఎంత అవసరమో, మనిషికి విజ్ఞానము, ఆత్మ నిగ్రహము అంతే అవసరము. లేకపోతే తనకు అందివచ్చిన అవకాశాలను కూడా ఉపయోగించుకో జాలడు.
విజ్ఞానము లైట్ లా దారి చూపిస్తే, ఆత్మ నిగ్రహము అనే బ్రేక్ జీవితానికి రక్షణ కల్పిస్తుంది. యింద్రియాలను జయించినవానికి లోకమే వసమగును.
Illustrations by Ms. Sainee
Digitized by Ms.Saipavitraa
(Sri Sathya Sai Balvikas Alumni)
[Ref: China Katha-I, Stories & Parables Pg:]