పదాలతో క్రీడలు
పదాలతో క్రీడలు
లక్ష్యం:
గురువు పదాలతో గోడ అంటే చార్ట్ కొన్ని కీ పదాలతో నిర్మితమై పదాలు చూస్తూ చదివి కథ చెప్పగలిగే ఆట.మొత్తం 25 పదాలతో ఉన్న ఆట చార్టులో 5 into 5 పదాలతో కూర్చబడి ఉన్న ఒక సందేశాత్మకమైన ఆట.
సంబంధించిన విలువలు:
- పరిశీలనా దృష్టి
- ఏకాగ్రత
- జ్ఞాపకశక్తి
అవసరమైన వస్తువులు:
- ఒక చార్ట్
- ఒక పెన్, స్కెచెస్, మార్కర్, పెన్, మరియు, స్కేల్
గురువు చేసుకోవలసిన సన్నాహాకాలు:
- బాలవికాస్ పుస్తకంలోని ఏదయినా ఒక విషయం ఇతివృత్తాన్ని తీసుకోవాలి, ఉదా-మతాలు
- చార్టు పైన 25 ముఖ్య పదాలు 3 లేదా 4 మతాలకు సంబందించిన పదాలు వ్రాసి 5 నిలువు డబ్బాలతో 5 అడ్డ డబ్బాలతో పదాలను చక్కటి అమరికతో కూర్చుకోవాలి.
ఎలా ఆడాలి
- గురువు తరగతిలోని విద్యార్థులను కొన్ని జట్లుగా విభజిస్తారు.
- గురువు తాను రూపొందించిన చార్టు ను పిల్లలదరికి 1 లేదా 2 నిముషాలు చూపించి గుర్తుపెట్టుకోమని చెప్పి తిరిగి చార్టు మూసి ఆ పదాల పొందికను వరుస క్రమములో పదాల స్థానాన్ని తెలుపమని అడగాలి.
- చార్టు తీసి ఒక్కొక్క గ్రూపును 10 ప్రశ్నలు అడగాలి.
- ఏ జట్టు ఎక్కువ ప్రశ్నలకు జవాబు చెప్పగలిగితే వారు ఎక్కువ మార్కులు పొందినట్లు అని తెలియజేయాలి.
ప్రశ్నలు:
- పట్టికలో ఇచ్చిన పుష్పం పేరేమిటి.
- పట్టికలో ఎన్ని పవిత్ర గ్రంథాల గురించి ప్రస్తావించబడినది
- జురాస్టర్ అనే పదం పట్టికలో చెప్పబడినది
- మొదటి వరుసలో ఉన్న ఐదు పదాలు వరుసగా చెప్పండి
- పట్టికలో చెప్పబడిన స్త్రీలు ఇద్దరి పేర్లేమిటి
- పట్టికలో ఏ మానవతా విలువ గురించి చెప్పబడినది?
- ఏ మతాల చివర రెండు అక్షరాలు ఒకే విధంగా ముగించబడినాయి ?
- ఈద్ పదం కింద ఉన్న పదం ఏది ____.
- పట్టికలో చెప్పిన ఇద్దరు ఋషులు ఎవరు.
- క్రిస్టియన్ మతానికి సంబంధించిన రెండు పదాలు ఏవి?
వైవిద్యమైన ప్రక్రియలు:
విభిన్న ఇతివృత్తాలు రామాయణం, పండుగలు, విద్యకు. సంబందించిన ఆటలు (educare)
మొదలైనవి కూడా ఎంచుకోవచ్చు
గురువులకు సూచనలు:
- సరదాగా ఉండే పదాల చార్ట్ ప్రక్రియతో వారు విభిన్న మతాలు,విషయాలు గురించి అర్థం చేసుకొని స్వీయ పరిశీలన చేసుకోగలుగుతారు!!
- అంతర్జాలంతో కూడా రూపొందించుకోవచ్చు.