యువ న్యాయ నిర్నేతలు
యువ న్యాయ నిర్నేతలు
లక్ష్యము:
సంభాషిస్తూ జ్ఞానసముపార్జన సంబంధిత విలువ.
సంబంధిత విలువలు:
విచక్షణ
అవసరమైన వస్తువులు:
అవసరం లేదు
గురువు ముందస్తు తయారీ:
అక్కర్లేదు
ఎలా ఆడాలి
- పిల్లలను వృత్తకారం లో కూర్చోమని గురువు చెప్పాలి.
- ఒక విద్యార్థి మధ్యలో నిల్చుని చెడ్డ పనులను అభినయించాలి (ఉదా:- రోడ్డు మీద ఉమ్మడం, గోడలపై రాయడం)
- పిల్లవాడు అవసరమైతే మాట్లాడవచ్చు కూడా
- మిగిలిన పిల్లలు ఒక నిమిషంలో అలా ఎందుకు చేయరాదో చెప్పాలి.
నిబంధనలు / బహుమతులు:
సరియైన సమాధానం ఇచ్చిన విద్యార్థి ఈసారి మధ్యలో నిలబడతాడు. ఎవ్వరూ సరిగా చెప్పలేకపోతే ముందు ఉన్న విద్యార్థి కొనసాగించాలి. గురువు నిర్నేతగా వ్యవహారిస్తారు.