శ్రీ సత్యసాయి బాలవికాస్ అనునది మానవుని పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసమునకు దోహదపడు ఉపకరణము. పిల్లలలో ఆధ్యాత్మిక బీజములు నాటి, సత్శీలవంతులుగా తీర్చిదిద్ది భారతదేశ ఆధ్యాత్మిక వారసత్వమునకు వారసులుగా తయారు చేసి, సకల ప్రాణి కోటిని ఏకత్వంతో గౌరవించే ఉత్తమ పౌరులుగా సమాజమునకు అందించేందుకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ప్రారంభించారు.
శ్రీ సత్య సాయి బాలవికాస్ ప్రపంచ పునరుద్ధరణ కొరకు మరియు విలువలతో కూడిన వ్యక్తిగత జీవనమునకు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు రూపొందించిన ఒక బృహత్తర కార్యక్రమము. ప్రతి బాలవికాస్ తరగతి ఈ క్రింద తెలిపిన అయిదు బోధనాపద్దతుల ద్వారా నిర్వహించు సమయం వారమునకు ఒకసారి ఒక్క గంట మాత్రమే.
ప్రార్థన
సామూహిక గానము
మౌనముగా కూర్చొనుట
కథలు చెప్పుట
సామూహిక కార్యక్రమములు
పాఠ్యాంశముల ప్రత్యేకత
ఇందులో 5 సంవత్సరముల నుండి 15 సంవత్సరముల మధ్య ఉన్నటువంటి పిల్లలకు మూడు వర్గములలో (గ్రూపులలో) రూపొందించినటువంటి 9 సంవత్సరముల కార్యక్రమము.
ప్రేమ మరియు అహింసలను పిల్లలు బాల్యంలోనే నేర్చుకొని వారు జీవితములో ఆచరించునట్లు చేయుట.
మొదటి వర్గము
గ్రూప్ -1: 5 నుండి 9 సంవత్సరములు ( మూడు సంవత్సరములకు)
వివిధ దేవతా మూర్తుల చిన్న చిన్న ప్రార్థనా శ్లోకములు
విలువలతో కూడిన కథలు
వివిధ దేవతామూర్తుల నామములతో భజనలు/ ప్రాంతీయ గీతములు
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదర్శ జీవిత పరిచయము.
పాఠ్యాంశముల ప్రత్యేకత
బాల బాలికలు వస్త్రధారణ చక్కగా ఉండి బాలవికాస్ నిర్వహించు తరగతిలో వేర్వేరుగా వారికి కేటాయించిన ప్రదేశంలో కూర్చోవాలి.
తరగతి గది బయటి వైపు పాదరక్షలు ఒక క్రమంలో ఉంచాలి.
ఇదే విధమైనటువంటి క్రమశిక్షణను వారి ఇంటిలో / తరగతి గదిలో అలవరచుకొనునట్లు చూచుట
రాత్రి కనీసం మూడుపూటల భగవంతున్ని ప్రార్థించునట్లు చేయుట.
పంచుకొంటూ భగవంతుడు ఒక్కడే నిజమైన స్నేహితుడు అని గ్రహించునట్లు చేయుట.
రెండవ వర్గము ( గ్రూప్-2) : 9 నుండి 12 సంవత్సరములు ( రెండు అంకెల వయస్సు ప్రగతి బాటకు సోఫానము)
వివిధ దేవతా మూర్తులమీద ప్రార్థనా శ్లోకములు
రామాయణ మరియు మహా భారతము వంటి పురాణ గాధలనుండి కొన్ని అంశములు
వివిధ దేవతామూర్తుల నామములతో భజనలు/ ప్రాంతీయ గీతములు
మత సమైక్యత మరియు వివిధ మత ప్రవక్తల/ సన్యాసుల కథలు
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆదర్శ జీవితము- భోధనలు
శ్రీ సత్య సాయి బాలవికాస్ రెండవ వర్గం(గ్రూప్-2) పూర్తి అయ్యాక
భగవద్గీతలో బోధించిన ప్రతి అంశములను వారి దైనందిన జీవితములో ఆచరిస్తారు. వివిధ మతముల ఆచారములను సంప్రదాయములను తెల్సుకొంటారు. వారి పండుగలు మరియు ఉత్సవములలో పాల్గొని సర్వమత సమన్వయమును పాటిస్తారు.
వారిలోని అంతర్వాణి ని గమనించి మంచి చెడుల మధ్యన విచక్షణా జ్ఞానమును అభివృద్ధి చేసుకొంటారు.
‘డ’ కార పంచకము అయిన (i) భక్తి (Devotion) (ii) విచక్షణ (Discrimination) (iii) క్రమశిక్షణ (Discipline) (iv) పట్టుదల (Determination) మరియు (v) కర్తవ్యము (Duty) లను వారి నిత్య జీవితంలో ఆచరిస్తారు.
భగవంతుడే మనకు గురువు మరియు మార్గదర్శకుడు అన్న విషయమును అంగీకరించి ప్రతి క్షణం గమనిస్తున్నాడనే ఎరుకను కల్గి ఉంటారు.
మూడవ వర్గము(గ్రూప్-3) :12 నుండి 15 సంవత్సరములు ( యుక్త వయస్సు గమ్మత్తైన వయస్సు)
భగవద్గీత మరియు భజగోవిందముల నుండి ఎంపిక చేసిన కొన్ని శ్లోకములు
ప్రాంతీయ మహా పురుషులు మరియు గొప్ప వారైన శ్రీ రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానందల జీవితములు
భజనలు/ భారతీయ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతల మీద ప్రాంతీయ గీతములు
శ్రీ సత్య సాయి సేవా సంస్థలలో మానవ సేవను పరిచయం చేయుట మరియు వారే స్వయంగా సేవా కార్యక్రములలో పాల్గొనునట్లు చేసి ఆనందమును అనుభవింప చేయుట .
శ్రీ సత్య సాయి బాలవికాస్ మూడవ వర్గం(గ్రూప్-3) పూర్తి అయ్యాక
లక్ష్యమును తెల్సుకొనే విధంగా ఆలోచిస్తారు (భజగోవిందం శ్లోకముల నుండి)
జీవితంలో వెంటాడుతున్న మరియు ముసుగులో ఉన్న జీవిత పరమార్థమును వివిధ పద్ధతుల ద్వారా అన్వేషిస్తారు ( భజ గోవిందం శ్లోకముల ఆధారముగా)
జన్మ భూమిలో తాను పొందిన ఆనందమును దేశ భక్తితో గర్వంగా చాటి చెప్పునట్లు తయారు అవుతారు. వివిధ రకముల సామాజిక సేవల ద్వారా సమాజ దృష్టి అభివృద్ధి అవుతుంది.
అంతర్ దృష్టిని గమనిస్తూ ఐక్యత మరియు పవిత్రతల మధ్య ఉన్న సంబంధమును తెల్సుకొని కోర్కెలపై అదుపును పాటిస్తూ తద్వారా దేశము యొక్క పురోభివృద్ధికి దోహదపడతారు.
శ్వాస నియంత్రణ మరియు సమయ నిర్వహణ వంటి వాటిని పాటిస్తూ వారి విధులను పాఠశాలలో, గృహములలో మరియు సమాజములో సక్రమంగా నిర్వహించి వ్యక్తిగత అభివృద్ధి సాధిస్తారు.
• జీవితం ఒక ఆట – ఆడు మరియు జీవితం ఒక సవాలు- ఎదుర్కో వంటి వాటిని ఆచరించి ఎటువంటి సమస్యను అయినా ఎదుర్కొనే ధైర్యము, నాయకత్వ లక్షణములు అలవడుతాయి. అంతే కాక “అహం బ్రహ్మాస్మి “ వంటి మహా వాక్యములను కూడా తెల్సుకొని ఆచరిస్తారు.
పైన తెలిపిన విధముగా భగవానుడు రూపిందించిన ఈ కార్యక్రమములో ఒక్కొక్క వర్గములో ఒక్కొక్క విధముగా పరివర్తన తెప్పించే అంశములు ముఖ్యమైనవి. శ్రీ సత్య సాయి బాలవికాస్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము ప్రతి పిల్లవానిలో మానవతా విలువల ద్వారా వారి వ్యక్తి గత నైపుణ్యములను అభివృద్ధి చేస్తూ దైనందిన జీవితంలో ఆచరించుట ద్వారా వారి వ్యక్తిగత, కుటుంబ, సామాజిక మరియు విశ్వ శాంతికి సహకరించునట్లు చేయుట.
ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు పాటించక నమ్మకమును కోల్పోయిన వారికి విద్యా సంవత్సరములో అసమర్థులైన వారికి పట్టం కడుతున్నారు. శ్రీ సత్య సాయి బాలవికాస్ ప్రపంచ యువ జనులకు ఈ దురదృష్టమునకు అడ్డుకట్ట వేసింది. తల్లిదండ్రుల సమావేశములు బాలవికాస్ ప్రముఖ పాత్ర వహిస్తాయి. శ్రీ సత్యసాయి తల్లిదండ్రుల సమావేశము ద్వారా ప్రస్తుతము పిల్లలు మీడియా మరియు యితర ప్రకటనలకు ప్రభావితమవుతున్నారు. ఈ స్థితి నుండి తల్లిదండ్రులను మేల్కొల్పి వారి పాత్రతను వివరిస్తూ వారిని విలువలతో కూడిన విద్యావంతులుగా తయారు చేస్తారు. ఇటువంటి తరుణంలో ఈ కార్యక్రమము విజయవంతంగా పూర్తి అగుటకు తల్లిదండ్రుల నుండి ఈ క్రింద తెలుపబడిన అంశములందు ఒప్పందము కావలెను.
శ్రీ సత్య సాయి బాలవికాస్ కార్యక్రమములో తల్లిదండ్రుల పాత్ర
పిల్లలు 9 సంవత్సరములు ఖచ్చితంగా పాల్గొనునట్లు చూడాలి.
ప్రతి వారము చివరలో మీ పిల్లలు బాలవికాస్ తరగతులకు క్రమశిక్షణతో హాజరు అగునట్లు చూడవలెను.
బాలవికాస్ కార్యక్రమము మీద నమ్మకం కల్గి ఉండాలి.
తరగతిలో నేర్చుకొన్న విలువలను ఇంటిలో పాటించునట్లు చూడవలెను.
ఈ ఉచిత సేవ యొక్క గొప్పదనమును అర్థము చేసుకొనవలెను.
అప్పుడప్పుడు గురువులతో మీ అమూల్యమైన అభిప్రాయములను తెలియజేయుట
బాలవికాస్ అభివృద్ధి పథములో నిర్వహించు తల్లిదండ్రుల సమావేశములలో పాల్గొనుట- చర్చించుట
కుటుంబంలో ఉన్న సత్సంబంధములను మెరుగుపరచే కార్యక్రమములలో పాల్గొనుట.
వ్యక్తిగత సంపూర్ణ మరియు సమగ్ర అభివృద్ధి
ఈ విధంగా శ్రీ సత్య సాయి బాలవికాస్ కార్యక్రమము పిల్లలో ఈ క్రింద తెలిపిన విధముగా ఐదు అంశములలో సమగ్ర అభివృద్ధిని సూచిస్తుంది.
శారీరక అభివృద్ధి
మేథో అభివృద్ధి
భావోద్వేగముల అదుపు
మానసిక అభివృద్ధి
ఆధ్యాత్మిక పురోగతి అభివృద్ధి
ఈ విధమైనటువంటి శ్రీ సత్య సాయి బాలవికాస్ కార్యక్రమము ప్రతి ఒక చిన్నారులలో మానవతా విలువలతో కూడిన సమగ్ర అభివృద్ధిని గావించి వారిని దివ్యాత్మ స్వరూపులుగా తీర్చి దిద్దుతుంది. అంటే కాకుండా వారు నేర్చుకొన్నటువంటి విలువలను వారి నిజ జీవితంలో ఆచరించునట్లు చేస్తుంది. శ్రీ సత్యసాయి ఎడ్యుకేర్ ద్వారా భగవాన్ బాబా మనకు అందించే సందేశము ఇదే.
వ్యక్తిగత సంపూర్ణ మరియు సమగ్ర అభివృద్ధి
జీవితములో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ఆత్మ విశ్వాసమును పెంపొందించుకొనుటలో మన పిల్లలకు మీరు మరియు మేము సహకరిద్దాం . తన మనస్సులోని అంతర్వాణి ( భగవత్ వాణి) అనుసరించి సరైన మార్గములో పయనించుటలో మీరు మరియు మేము సహకరిద్దాం. సృజనాత్మకతతో మరియు సుఖ సంతోషములతో జీవించుటలో మీరు మరియు మేము సహకరిద్దాం. సమాజమునకు మరియు దేశమునకు సేవ చేసే విధంగా మనం తీర్చిదిద్దుదాం. మన పిల్లలను భారత దేశ ఆదర్శ వంతమైన పౌరులుగా తీర్చిదిద్దుదాం.