సత్యం మాట్లాడుట – మంచి అనుభూతిని పొందుట
సత్యం మాట్లాడుట – మంచి అనుభూతిని పొందుట
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి…. పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి. |
సుఖాసనంలో కుర్చీ మీద కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కూర్చోండి.
వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.
మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
కళ్ళు మూసుకోండి. అలా వీలుకాకపోతే నేలవైపు చూడండి.
మళ్లీ దీర్ఘ శ్వాస తీసుకోండి.
ఇప్పుడు మీరు అబద్ధం చెప్పిన సందర్భాన్ని గురించి ఆలోచించండి.
ఇప్పుడు మీరు ఎలాంటి అనుభూతిని పొందారు?
ఇప్పుడు నిజాన్ని చెప్పిన సందర్భాన్ని గురించి ఆలోచించండి.
నిజం చెప్పినందుకు మీ వెన్ను తట్టుకోండి.
ఇప్పుడు నేను చిన్నగా వినిపించే గంటల శబ్దం తో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.
చర్చ:
- నిజం చెప్పినందువలన నీకు కలిగిన అనుభూతి ఏమి?
- మీరు మీ స్వవిషయమై ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?
- ఎవరైనా మీకు అబద్ధం చెప్పినప్పుడు, మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీకు కోపం వస్తుందా?
[శ్రీ సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక.-కరోలే ఆల్డర్మాన్]