ఇతరులను అర్థం చేసుకొనుట – మంచి అనుభూతిని పొందుట.

Print Friendly, PDF & Email
ఇతరులను అర్థం చేసుకొనుట – మంచి అనుభూతిని పొందుట.
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి…. 
పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి.

ఒకవేళ అనుకూలంగా ఉంటే మధ్యలో ఒక అడుగు స్థలం ఉండేలాగా వృత్తాకారంలో పిల్లల్నికూర్చోనివ్వండి. అలా లేనిచో వారిని కుర్చీలో లేదా సుఖాసనంలో కూర్చోమనండి.

వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.

మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.

కళ్ళు మూసుకోండి.అలా మీకు అసౌకర్యంగా ఉంటే నేలవైపు చూడండి.

మళ్లీ దీర్ఘ శ్వాసను తీసుకోండి.

గదిలోని శబ్దాన్ని వినండి.

గది వెలుపల నుండి వచ్చే శబ్దాన్ని కూడా వినండి.

నేను సంతోషంగా ఎలా ఉండగలను? ఇతరులను ఎలా ప్రేమించగలను? అని ఆలోచించండి.

ఇప్పుడు నేను చిన్నగా చేసే గంటల శబ్దంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.

[శ్రీ సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక.-కరోలే ఆల్డర్మాన్]