అంతరంగ ప్రశాంతత మరియు ధ్యాస
అంతరంగ ప్రశాంతత మరియు ధ్యాస
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి…. పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి. |
(మీకు అవసరమైతే) నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని వినటానికి పెట్టండి.
సుఖాసనంలో కుర్చీ మీద కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కూర్చోండి.
వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.
మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
కళ్ళు మూసుకోండి.అలా వీలు కాకపోతే నేలవైపు చూడండి.
మళ్లీ దీర్ఘ శ్వాస తీసుకోండి.
తరగతి గదిలోని శబ్దాన్ని వినండి.
మృదువైన శబ్దాన్ని వినండి.
పెద్ద శబ్దాన్ని వినండి.
తరగతి గది వెలుపలి అన్ని శబ్దాలను వినండి.
దూరం నుండి వచ్చే రవాణా శబ్దాలను, పక్షుల కిలకిల రావాలను వినండి.
అన్ని శబ్దాలను వినండి. ఇప్పుడు నేను చిన్నగా చేసే గంటల శబ్దం తో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.
చర్చ:
(పిల్లలు చేసే ఈ అభ్యాసం తదుపరి వారి ఏకాగ్రతకు తోడ్పడుతుంది.)
- నీవు ఏమి విన్నావు? ఏవైనా పెద్ద శబ్దాలను విన్నావా?
- నీవు ఏవైనా మృదువైన శబ్దాలను విన్నావా? ఏదైనా ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతున్నావా?
- నీవు అనుభూతి చెందిన మృదువైన మరియు పెద్దశబ్దాలు యొక్క ఉదాహరణలతో తెల్పండి?
[సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక. -కరోలే ఆల్డర్మాన్]