స్పర్శ – ఆకు
స్పర్శ-ఆకు
ప్రియమైన పిల్లలూ!
మీరు ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నారు. గట్టిగా లోపలికి గాలి తీసుకొని వదలండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి.
పక్కనే సరస్సులో తేలియాడుతున్న ఆకును చూడండి. అది ఒక చెట్టు మీద నుంచి కింద పడింది. ఆ ఆకు చిన్నదే కానీ దానిపై చిన్న చీమ కూర్చొని ఉన్నది . ఆ విధంగా ఆ చిన్న ఆకు ఒక చిన్న చీమకు బ్రతకడానికి ఆధారమైంది.
మనం దీని నుంచి ఎంత మంచి పాఠం నేర్చుకున్నాం. ఈ ప్రపంచంలో ఏదీ వ్యర్థమైనది కాదు. ఇలా నీటిపై తేలే ఆకులాగానే, భగవంతుని ప్రతి పనికీ ప్రణాళిక, పథకం ఉంటుంది.
అశాశ్వతమైన మన జీవితాన్ని కూడా ప్రపంచానికి ఉపయోగపడనివ్వండి.
అందరికీ దయను ప్రసరింపజేసి ప్రేమ జ్యోతిని వ్యాపింప చేయండి. ఒక చిన్న ఆకే అంత ఉపయోగపడితే, మనం ఆ మాత్రం సమాజానికి ఉపయోగపడలేమా?
అవును.. మీ జీవితాన్ని అవసరమైన వారిని ఆదుకునే సహాయ కారిగా మార్చుకోండి.
జీవితాల్ని ఇచ్చుట క్షమించుట ద్వారా ప్రేమించండి. ప్రేమను అంతటా వ్యాపింప చేయండి.
మెల్లగా కళ్ళు తెరవండి.
ప్రశ్నలు:
- ఆకు వలన ఉపయోగాలేమి?
- ఈ ప్రపంచంలో ఎందుకు పనికిరానివి ఏమైనా ఉన్నాయా? ఉంటే పేర్కొనండి.