వాసన- పౌడర్

Print Friendly, PDF & Email

వాసన- పౌడర్

పిల్లల చేతిలో మొహానికి రాసుకునే పౌడర్ను చల్లండి.

ప్రియమైన పిల్లలూ..!

పౌడర్ని చేతులతో రుద్దుకొని వాసన చూడండి. కళ్ళు మూసుకోండి. ఆ సువాసన మిమ్మల్ని తాజాగా ఉంచుతుంది. మీరు స్నానం చేశాక, ముఖం కడుక్కున్నాక చర్మం తాజాగా ఉండ డానికి పౌడర్ రాసుకుంటారు. శరీరం శుభ్రంగా కనపడడానికి మనం పౌడర్ రాసుకుంటాము.

మన హృదయ పరిశుభ్రత కు గుర్తుగా విభూది ధరిస్తాము.

“పరమం పవిత్రం బాబా విభూతిం…” విభూతి ధరించడం మర్చిపోకండి. అది బాబా అనుభూతిని అంది స్తుంది.

ఎలాగయితే ప్రతిరోజు భోజనం చేయటం మానమో,అలాగే విభూతి ధరించకుండా బయటకు వెళ్ళకండి. అది భగవంతుని రక్ష మనకు.

నెమ్మదిగా కళ్ళు తెరవండి.

ప్రశ్నలు:
  1. శరీరం: పౌడరు:—విభూతి
  2. రోజు విభూతి మంత్రం చదవండి.. విభూతి మనకే ప్రయోజనాలు చేకూరుస్తుంది?