మర్యాద

Print Friendly, PDF & Email
మర్యాద

దశ 1

  1. సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ లో కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
  2. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
  3. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
  4. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2

ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళని సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు చూడండి. తిరిగి కుడి వైపుకు చూడండి.మళ్ళీ ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. ఉద్రేకాలు అన్నీ తొలిగిపోతాయి.

దశ 3

మీరు ఒక చెట్టు అని ఊహించుకోండి. చెట్టు యొక్క కొమ్మలు ఆకాశానికి అంటుతున్నాయి. మరియు వేర్లు భూమి లోపలికి బాగా విస్తరించి ఉన్నాయి. కాండము చాలా బలంగా ఉంది. మీరు శ్వాసను తీసుకున్నప్పుడు, మీ కొమ్మల ద్వారా కొత్త జీవితాన్ని మరియు ఆహ్లాదాన్ని పొందినట్లుగా అనుభూతిని పొందండి. మీరు శ్వాసను బయటకు వదిలినప్పుడు, మీ చెట్టు యొక్క పై భాగము మృదువుగా అవుతుంది. మీ ఆకులు మెరుస్తాయి.

ఊపిరి పీల్చుకున్నప్పుడు, మీరు బలంగా మరియు దృఢంగా మారడానికి కావలసిన వాటిని మీ వేర్ల ద్వారా పంపండి.మీరు ఊపిరి పీల్చుకున్నప్పుడు, దూది లాగా, మృదువుగా మరియు తేలికగా మారండి… ఇప్పుడు మీ వేర్ల చుట్టూ ఆడుకునే ఉడుతలకు శుభోదయం చెప్పండి. మీ ఆకుల మధ్య కూర్చుని పాడే పక్షులకు ధన్యవాదములు చెప్పండి.

మీకు పొందిన అనుభూతిని ఆస్వాదించండి.మీరు మీ కళ్ళు తెరవటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కళ్ళు మెరుస్తూ ఉంటాయి! మీ స్నేహితులను చూడండి, వారి కళ్ళు కూడా మెరుస్తాయి!

దశ 3

ఇప్పుడు దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.

కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.

[BISSE Ltd శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధిని ఆధారంగా.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: