వన్యప్రాణుల పరిశీలన
వన్యప్రాణుల పరిశీలన
దశ 1
- సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీలో కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
- మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.
- మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
- కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.
దశ 2
ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళని సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు చూడండి. తిరిగి కుడి వైపుకు చూడండి.మళ్ళీ ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని పొందండి. ఉద్రేకాలు అన్నీ తొలిగిపోతాయి.
దశ 3
ఇప్పుడు ఐదు ఇంద్రియాల గురించి తెలుసుకోండి… గదిలోని గాలి యొక్క వాసన… మీ నోటిలోని నీటి రుచి… మీ పాదాల క్రింద నేల యొక్క దృఢత్వం. చర్మంపై గాలి యొక్క స్పర్శ. గదిలో శబ్దాలు వినండి. (ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు). తర్వాత గది వెలుపల ఉన్న శబ్దాలను వినండి. ఈ వినికిడిని మీకు వీలైనంత వరకు విస్తరించండి.
దశ 4
మీరు ఒక గ్రామీణ ప్రాంత మార్గంలో నడుస్తున్నట్లుగా ఊహించుకోండి… మీ పాదాల కింద వున్న నేల మెత్తగా ఉంది. చెట్ల కొమ్మలు మార్గానికి తోరణం వలే రూపొంది, చల్లని నీడను అందిస్తున్నాయి. వాటి కొమ్మల ద్వారా సూర్యకాంతి వడపోసి నట్లుగా ఏర్పడి ఆ మార్గం అంతా బంగారు కాంతిని చేకూరుస్తుంది.
పక్షులు ఆనందంగా పాడుతున్నాయి. వారి గానాన్ని వినండి. ఒక చెట్టు నుండి ఇంకొక చెట్టుకు ఎగురుతున్న పక్షులను చూడండి… దారి పక్కనే ఎరుపు చారలు ఉన్న పిట్ట మీ దగ్గరికి పరిగెత్తుకుని వస్తోంది. చూడండి… వారు జీవించి ఉన్నందుకు సంతోషంగా ఉన్నారు. మీరు కూడా సంతోషంగా ఉన్నారు.
దశ 5
ఇప్పుడు మీ దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తి అయినది కనుక మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.
కూర్చుని చేసే ఈ వ్యాయామం యొక్క అనుభవాలను విద్యార్థులు పక్కవారితో పంచుకోవాలని కూడా అనుకోవచ్చు కనుక వారిని ప్రోత్సహించండి.ఈ వ్యాయామం వలన వారు ఎటువంటి అనుభూతిని పొందారో అడగండి. ఆ అనుభూతిని చిత్రంగా గీయమని ప్రోత్సహించడం వల్ల పిల్లలలో సృజనాత్మకత పెంపొందుతుంది.
[శ్రీ సత్యసాయి మానవతా విలువల బోధిని ఆధారంగా.]