వివేచన
వివేచన
మంచిని ఎన్నుకొనుటకై మనలో అంతర్గతంగా ఉన్న సత్యాన్ని ఎలా కనుగొనాలో తెలుసుకోవటం.
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి. (పేరాగ్రాఫ్ లు మరియు పుల్ స్టాప్ ల వద్ద నిలపండి)
దశ 1 :
సౌకర్యం వంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కూర్చోండి. వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘ శ్వాసను మళ్లీమళ్లీ తీసుకోండి.
దశ 2 :
ఇప్పుడు శరీరంలోని ఉద్రిక్తతను తగ్గించండి. మీ కాలు వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. పిక్క కండరాలను బిగించి, ఆపై వాటికి విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మీ పైకాళ్లు మరియు తొడలలోని కండరాలను బిగించండి. ఆ తర్వాత వాటికి విశ్రాంతినివ్వండి. మీ కడుపు కండరాలను లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. భుజాలను వెనక్కి లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి కిందికి తట్టండి. ఇప్పుడు మీ ఎడమ వైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. తిరిగి కుడివైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. ఇప్పుడు మీ ముఖం యొక్క కండరాలను బిగించండి. తిరిగి వాటికి విశ్రాంతినివ్వండి.మీ శరీరం మొత్తం విశ్రాంతి పొందినట్లుగా అనుభూతి పొందండి. అప్పుడు మీలోని ఉద్రిక్తతలన్నీ తగ్గిపోయి మీరు మంచి అనుభూతిని పొందుతారు.
దశ 3 :
మీరు ఉత్తమమైన వారిగా ఉండాలని నిర్ణయించుకోండి. అంతర్గీనంగా మీలో ఉన్న మంచి వ్యక్తిని చూడండి. మీలో అంతర్గీనంగా ఉన్న మంచి వారైన ఇతర వ్యక్తులను కూడా చూడండి. ఇతరుల గురించి మరియు మీ గురించి సదాలోచనలు పెంపొందించుకోండి. మీరు మంచివారు కనుక మంచితనమే ఎల్లప్పుడూ గెలుస్తుంది. మంచినే నిర్ణయించుకోండి.
మీరుకూడా ఉన్నతమైన వ్యక్తులుగా ఉండాలని దృఢంగా నిర్ణయించుకుని, నిజాయితీగా మాట్లాడితే మీరు చేసే పనులు కూడా ఉన్నతమైనవిగా ఉండి, మంచి ఆలోచనలను బలపరుస్తాయి.
ఇతరులకు మంచి చేయండి.
మీపై మీరు దయ కలిగి ఉండండి.
ఈరోజు మీరు ఏమి చేయగలరు? (దీర్ఘ విరామం)
దశ 4 :
ఇప్పుడు మళ్ళీ మీరు తిరిగి మీ తరగతి గదిలోనికి రండి. మీ కళ్ళను విప్పార్చండి. ఈ వ్యాయామం అయినది కనుక మీ ప్రక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.
[శ్రీ సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా]