పాండురంగ భజనమండలి
పాండురంగ భజనమండలి
బాబా ఏడు సంవత్సరాల వయసులో నున్నప్పుడు పుట్టపర్తిలో కలరా, స్ఫోటకము వంటి అంటవ్యాధులు అమితంగా ప్రబలిపోయాయి. ప్రజలు భయభ్రాంతులగుటచే వారి పిల్లలను బయటికి పంపక ఒకరితో ఒకరిని కలవనివ్వక, బయట ఎక్కడా నీరుగానీ, తినుబండారాలని గానీ తిననివ్వక తాగనివ్వక బహు కట్టడి చేసేవారు. అపుడు కొండమరాజుగారు కూడృ బాబాకి ఆ వ్యాధులు సోకుతాయేమోనని భయంతో అతనిని బయటికి పోనిచ్చేవారు కారు. పైగా కొంతమంది బోయవాళ్ళను “బాడీగార్డ్స్” గా పెట్టారు. అయినా బాబా తాతగారి కన్నుగప్పి బయటికి వచ్చి, కొందరు పిల్లలను పిలిచేవారట. ఆ పిల్లలు బాబా దగ్గరకి వచ్చి “రాజు! మన గ్రామానికి కలరా వచ్చిందట, అది చాలా ప్రమాదకరమైన వ్యాధియట. క్షణంలో ప్రాణం తీసుకుపోతుందట. మా గతి ఏమౌతుందో” అని చాలా భయపడ్డారు.
అప్పుడు బాబా వారిని భయపడవద్దని చెప్పి భగవంతుని నమ్మి ప్రార్థన చేస్తే అన్ని కష్టాలు పటాపంచలౌతాయని చెప్పారట. పిల్లలందరిని చేర్చుకుని భజనపాటలు స్వయంగా వ్రాసి వారికి నేర్పి ‘పాండురంగ భజనమండలి’ ని ఏర్పాటు చేసారట. ఈ భజనమండలివారు దీపస్తంభము నెత్తుకొని వీధులలో భజనలు చేయుచుండగా కలరా, స్ఫోటకము మొదలగు వ్యాధులు తగ్గిపోయినవట. ఇది చూచి ఇరుగు పొరుగు గ్రామములవారు కూడా వీరిని తీసుకొని వెళ్ళి భజనలు చేయించుకొని వారి యూరిలోని కలరా వ్యాధిని పారద్రోలుకొనిరి.
[Source : Lessons from the Divine Life of Young Sai, Sri Sathya Sai Balvikas Group I, Sri Sathya Sai Education in Human Values Trust, Compiled by: Smt. Roshan Fanibunda]