కృష్ణ రామ గోవింద నారాయణ
సాహిత్యం
- కృష్ణ రామ గోవింద నారాయణ
- మాధవ కేశవ హరి నారాయణ
- కృష్ణ రామ గోవింద నారాయణ
- శ్రీ వేణుగోపాల కృష్ణ
- మాధవ మధుసూధన నారాయణ
అర్ధము
కృష్ణ, రామ, గోవింద, నారాయణ, మాధవ, కేశవ, హరి, వేణుగోపాల, మధుసూదనా అను వివిధ నామములతో కీర్తింపబడు ఓ నారాయణ నీకు మా నమస్కారములు.
వివరణ
కృష్ణ రామ గోవింద నారాయణ | వివిధ నామములతో కీర్తింపబడు- కృష్ణుడు, రాముడు, గోవిందుడు మరియు నారాయణుడు, అందరినీ ఆకర్షించేవాడు మరియు అంతటా వ్యాపించి ఉన్నవాడు; మనలను రక్షించేవాడు మరియు మన ధోరణులను ఉత్కృష్టం చేసేవాడు. |
---|---|
మాధవ కేశవ హరి నారాయణ | ప్రకృతికి అధిపతి అయిన మాధవ, నల్లటి జుత్తు గల కేశవ, కష్టములను హరించు హరి మరియు నారాయణ అనే పేర్లతో భగవంతుడిని మేము స్తుతిస్తాము. |
శ్రీ వేణుగోపాల కృష్ణ | వేణువును వాయిస్తూ గోవులను పాలించే స్వామి మరియు అన్ని జీవులను ఆకర్షించే భగవంతుని సంపూర్ణముగా శరణు వేడుచున్నాము మమ్మలను ఉద్ధరించమని ప్రార్థన. |
మాధవ మధుసూధన నారాయణ | మధు అనే రాక్షసుడిని సంహరించిన భగవంతుడిని మాధవ, మధుసూధన మరియు నారాయణ అని కీర్తిస్తాము; మన మనస్సుల నుండి ఇంద్రియ సుఖాల ప్రలోభాలను నాశనం చేసే సృష్టి యొక్క సర్వవ్యాపకత్వము కలవాడవు. |
రాగం: బాగేశ్రీ
శృతి: C# (పంచమం)
బీట్ (బీట్): కెహెర్వా లేదా ఆది తాళం-8 బీట్
Indian Notation
Adopted from : https://archive.sssmediacentre.org/journals/vol_11/01NOV13/bhajan-tutor-Krishna-Rama-Govinda-Narayana.htm