అసతోమా – ఆక్టివిటీ
చెప్పవలసిన కథ – ఏదైనా ఒక చెడు గుణాన్ని వదిలివేయండి(చిన్న కథలోని ఒక కథ). పిల్లల్ని ఇందులోని పాత్రలను పోషించమని చెప్పండి.
ఏదైనా ఒక చెడు గుణాన్ని వదిలివేయండి – కథ
ఒకసారి ఆధ్యాత్మిక జీవితం గడుపుదాము అనుకున్న ఒక దుర్మార్గుడు దీక్ష కోసం ఒక గురువు వద్దకు వెళ్ళాడు. అప్పుడు గురువు గారు తన చెడు అలవాట్లలో ఒకదాన్ని వదులుకోవాలని కోరారు. అప్పుడు అతను అబద్ధం చెప్పడం మానేశాడు, అయితే, ఆ రాత్రి అతను దొంగతనానికి రాయల్ ప్యాలెస్ నకు వెళ్ళినప్పుడు అక్కడ మరొక వ్యక్తిని టెర్రేస్ మీద కలిశాడు. అప్పుడు వారిద్దరూ ఖజానాలో దొరికిన వజ్రాలను పంచుకున్నారు. అయితే మరొక వ్యక్తి ఎవరో కాదు, అక్షరాల ఆ రాజ్యానికి రాజు.
రాజు దొంగగా నటించి, ఆ ఖజానా తాళం చేతులు ఎక్కడ ఉన్నాయో తనకు తెలుసునని చెప్పాడు. అయితే ఆ నిజాయితీ గల దొంగకి వజ్రాలు కోల్పోతున్న రాజు గారి మీద జాలి కలిగింది. అప్పుడు అతను ఒక్క వజ్రం మాత్రం ఆ ఖజానా లోనే ఉంచవలసిందిగా మరొక దొంగని కోరాడు. ఇదిలా ఉండగా, మరుసటి రోజు ఉదయం, ఖజానా కొల్లగొట్టినట్లు రాజుగారు అధికారికంగా తెలుసుకున్నారు. నష్టాన్ని అంచనా వేయడానికి రాజు గారు(అంతకు ముందు రాత్రి దొంగగా వ్యవహరించిన వ్యక్తి) మంత్రిని పంపారు. దొంగలు వదిలివెళ్లిన వజ్రాన్ని మంత్రి గమనించాడు. అతను దానిని రహస్యంగా తన జేబులో వేసుకొని, వజ్రాలు అన్నీ పోయాయని అబద్ధం చెప్పాడు.
ముందురోజు రాత్రి రాజుగారు వజ్రాలను పంచుకున్న తరువాత ఆ దొంగ చిరునామా తెలుసుకున్నారు. అందువల్ల ఆ రాజు గారు ఆ దొంగని పిలిపించి ఆరా తీయగా, తను ఒక వజ్రం ఖజానాలోనే వదిలి వెళ్లిన విషయం వివరించాడు. ఆ తరువాత మంత్రి జేబులో ఉన్న వజ్రం గురించి తెలుసుకున్న రాజు ఆ మంత్రి స్థానంలో నిజాయితీగల దొంగని నియమించారు. ఆ తర్వాత ఆ దొంగ తన చెడు అలవాట్లని పూర్తిగా విడిచిపెట్టి ఒక మంచి నిర్వాహకుడిగా గొప్ప కీర్తిని సంపాదించి తన గురువును కూడా సంతోషపెట్టాడు.
క్లుప్తంగా:
దొంగ అసత్య మార్గాన్ని విడిచిపెట్టి సత్య మార్గంవైపు పయనించాడు. పర్యవసానంగా దొంగ జీవితం చీకటి నుండి వెలుగులోకి వచ్చింది మరియు అతను చాలా సంపన్నుడు అయ్యాడు. దీని ఫలితంగా అతను చెడు అలవాట్లను విడిచిపెట్టి మంచి మనిషిగా మారాడు. ప్రజలు అతని సుగుణాలను చాలాకాలం గుర్తుంచుకున్నారు. మనం మంచి మార్గం అనుసరిస్తే అమరత్వం పొందుతాము ఎందుకంటే ప్రజలు మనల్ని శాశ్వతంగా గుర్తుంచుకుంటారు.
ఈ కార్యాచరణ ఎన్నో ఇతర విలువలకు దారి తీస్తుంది. మనము ఏదైనా ఒక మంచి పద్ధతిని హృదయపూర్వకంగా అభ్యసించడం వల్ల, మరెన్నో మంచి పద్ధతులు అలవడతాయి మరియు స్థిరంగా నిలిచిపోతాము. ఉదాహరణ: మహాత్మా గాంధీ, ఆల్బర్ట్ ఐన్స్టీన్, అబ్దుల్ కలాం మొదలైనవారు.
చర్చ:
ఒక నెల రోజుల పాటు అబద్ధాలు చెప్పడం మానేయమని పిల్లలను అడగండి మరియు ప్రతి క్లాసులో అవి పాటించడం ఎంత సులభమో/ కష్టమో చర్చించండి. దాని ప్రయోజనాలు పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి.