ఆక్టివిటీ : వార్తా పత్రికతో వేణువు (FLUTE) తయారు చేయుట
కావల్సిన వస్తువులు :
- 10 వార్తాపత్రికలు
- బట్ట / లైనింగ్ క్లాత్
- బంగారు రంగు త్రాడు
- సూది – దారం
- రంగురంగుల పూసలు
- ధర్మోకోల్ బాల్స్
- స్కేల్, పెన్సిల్, జిగురు
పద్ధతి లేదా విధానము :
- మొదట 5 వార్తాపత్రికలను తీసుకొని ఒక దాని మీద మరొకటి పేర్చి గుండ్రటి గొట్టంలా మడచి జిగురుతో అతకాలి
- కాగితపు ఫ్లూట్ పొడవు 36 సెం.మీ. ఉండాలి
- స్కేల్ మరియు పెన్సిల్ తీసుకొని 8 సెం.మీ , 11 సెం.మీ, 14 సెం.మీ, 18సెం.మీ ఉండునట్లు నాల్గు వృత్తాలను గొట్టము పై భాగంలో మాత్రమే నెమ్మదిగా కత్తి/ కత్తెర సహాయంతో కత్తిరించాలి
- పెన్సిల్ సహాయంతో రంధ్రములను పెంచాలి
- మంచి బట్ట ముక్కను తీసుకొని కాగితపు గొట్టంపై రంధ్రములు చేసినట్లుగా అదే కొలతలతో రంధ్రములు చేసి జిగురు (Glue) సహాయంతో అతికించాలి
- ఇప్పుడు సూది దారము తీసుకొని థర్మోకోల్ బాల్స్ ను మరియు రంగు రంగుల పూసలను ఎక్కించి వేలాడే కుచ్చుల్లా చేసి ఫ్లూట్ కి చివరలో అతికించాలి
- ఫ్లూట్ మధ్య భాగంలో మంచి రంగు లేసు లాంటిది అతికించాలి.
బంగారు రంగు దారమును రంధ్రముల వద్ద అతికించాలి.
వేణువు (ఫ్లూట్) తయారి అయిపోయినది.