గోవింద కృష్ణ విఠలే – ఆక్టివిటీ

Print Friendly, PDF & Email
ఆక్టివిటీ : వార్తా పత్రికతో వేణువు (FLUTE) తయారు చేయుట

కావల్సిన వస్తువులు :
  • 10 వార్తాపత్రికలు
  • బట్ట / లైనింగ్ క్లాత్
  • బంగారు రంగు త్రాడు
  • సూది – దారం
  • రంగురంగుల పూసలు
  • ధర్మోకోల్ బాల్స్
  • స్కేల్, పెన్సిల్, జిగురు
పద్ధతి లేదా విధానము :
  1. మొదట 5 వార్తాపత్రికలను తీసుకొని ఒక దాని మీద మరొకటి పేర్చి గుండ్రటి గొట్టంలా మడచి జిగురుతో అతకాలి
  2. కాగితపు ఫ్లూట్ పొడవు 36 సెం.మీ. ఉండాలి
  3. స్కేల్ మరియు పెన్సిల్ తీసుకొని 8 సెం.మీ , 11 సెం.మీ, 14 సెం.మీ, 18సెం.మీ ఉండునట్లు నాల్గు వృత్తాలను గొట్టము పై భాగంలో మాత్రమే నెమ్మదిగా కత్తి/ కత్తెర సహాయంతో కత్తిరించాలి
  4. పెన్సిల్ సహాయంతో రంధ్రములను పెంచాలి
  5. మంచి బట్ట ముక్కను తీసుకొని కాగితపు గొట్టంపై రంధ్రములు చేసినట్లుగా అదే కొలతలతో రంధ్రములు చేసి జిగురు (Glue) సహాయంతో అతికించాలి
  6. ఇప్పుడు సూది దారము తీసుకొని థర్మోకోల్ బాల్స్ ను మరియు రంగు రంగుల పూసలను ఎక్కించి వేలాడే కుచ్చుల్లా చేసి ఫ్లూట్ కి చివరలో అతికించాలి
  7. ఫ్లూట్ మధ్య భాగంలో మంచి రంగు లేసు లాంటిది అతికించాలి.

బంగారు రంగు దారమును రంధ్రముల వద్ద అతికించాలి.

వేణువు (ఫ్లూట్) తయారి అయిపోయినది.