నెమలి
పిల్లలూ! ఒక్కసారి పైకి ఎగిరి చుట్టూ తిరగండి. చేతులు పైకి ఎత్తండి. కిందికి దించండి.
ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ మనో నేత్రంతో ఒక నెమలిని చూడండి.నెమలి మన జాతీయ పక్షి, దాన్ని మీ మనసులో ఊహించుకోండి
నెమలి
పిల్లలూ! ఒక్కసారి పైకి ఎగిరి చుట్టూ తిరగండి. చేతులు పైకి ఎత్తండి. కిందికి దించండి.
ఇప్పుడు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మీ మనో నేత్రంతో ఒక నెమలిని చూడండి.నెమలి మన జాతీయ పక్షి, దాన్ని మీ మనసులో ఊహించుకోండి
నిటారుగా చిన్ముద్రలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి.
నా మాటలు వింటూ నెమలి రూపాన్ని ఊహించుకోండి.
మనం నెమళ్ళు వుండే తోటకి వెళ్తున్నాం. నెమళ్లు గింజలు ఏరుకుంటున్నాయి. ఆకాశంలో నల్లగా మబ్బులు కమ్ముతున్నాయి. నెమలి తన యొక్క తోక ఈకలను తెరిచి పురివిప్పి ఆడుతున్నది. వావ్! ఎన్ని రంగుల ఈకలు వున్నాయి. అది చాలా ఉల్లాసంగా ఉన్నది. దాని రంగు నీలంగా ఉం.ది దాన్ని మెడ అటు, ఇటు తిప్పుతూ చూస్తూ ఉంటే నృత్యం చేసినట్లుగా ఉంది. నెమలి పురి విప్పి తన అందాలను చూపుతున్నది. మనం కూడా మనలోని అందాన్ని అలా చాటగలగాలి. అందరం నెమలి వంటి అందమైన వాళ్ళమే. మనలో అనేక రంగులు వున్నాయి. అవే దయ, నిజాయితీ, పరిశుభ్రత, క్రమశిక్షణ, మంచి, మర్యాదలు అనే లక్షణాలు అవే మన ఈకలు కూడా. వాటితోనే మన జీవన సౌందర్యాన్ని చాటవచ్చు. ప్రకృతి మనకి పాఠాలు నేర్పుతుంది.
అందుకే ప్రకృతిని కాపాడాలి.
మెల్లగా కళ్ళు తెరవండి.
దేవుడా! మంచిని చూడటానికి, మంచిని చేయటానికి, మంచిగా ఉండటానికి, నాకు సహాయం చేయండి. మార్గదర్శకత్వం చూపించండి.
కార్యాచరణ:
తోటలో చూసిన నెమలి ని చిత్రంగా గీయండి.
[Source : Silence to Sai-lens – A Handbook for Children, Parents and Teachers by Chithra Narayan & Gayeetree Ramchurn Samboo MSK – A Institute of Sathya Sai Education – Mauritius Publications]