ఓం శ్రీ రాం భజన – ఆక్టివిటీ
సామూహిక కార్యక్రమము: సాయి రాం ఆట
పిల్లలందరినీ వృత్తాకారములో కూర్చుండ బెట్టవలెను. పిల్లలు ప్రతి ఒక్కరు “సాయి” అన్నప్పుడు అరచేతులను పైకి చూపించాలి. “రాం” అన్నప్పుడు అర చేతులకు వెనుక భాగం చూపించాలి. ఎవరైనా తప్పుగా చేసినచో వారు ఆటలో ఓడినట్లు. ఇలా ఒకసారి సాయి అని మరొకసారి రాం అని పదే పదే మారుస్తూ ఆడించాలి. చివర వరకు మిగిలిన ఒక్కరు విజేత.