మర్యాదని పాటించడం
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి. పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి. |
నెమ్మదిగా స్థిరాసనంలో కూర్చోండి..
వెన్నెముకను నిటారుగా ఉంచండి.
మోకాళ్లపై చేతులను ఉంచండి.
మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
ఈసారి శ్వాసను నిశ్శబ్దంగా లోపలికి తీసుకుని వదలడానికి ప్రయత్నించండి.
శరీర భాగాలను నిశ్చలంగా ఉంచి మీరు కూర్చున్న గదిలోని ప్రశాంతతను అనుభవించండి.
మీ కళ్ళను మూసుకోవాలనుకుంటే ఐదు సెకండ్ల పాటు మూసుకోండి.
ఇప్పుడు మీ తరగతి గది వెలుపలి శబ్దాలను వినండి.
వర్షపు చినుకుల శబ్దం, గాలి వీస్తున్న శబ్దం, పక్షుల కిలకిల రావాలు, కుక్కల అరుపులు వంటి శబ్దాలను వినండి.
మీరు మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడే విధానాలను గురించి ఆలోచించండి…
ఇప్పుడు మీ శరీరాన్ని నెమ్మదిగా సడలింపజేసి, కళ్ళను నెమ్మదిగా తెరిచి నవ్వండి.
ఇప్పుడు నిశ్శబ్దంగా లేచి దగ్గరగా వచ్చి కూర్చోండి.
చర్చ:
- మీరు ఇక్కడ ఎలాంటి శబ్దాలు విన్నారో చర్చించండి?
- మీరు నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు ఏమి ఆలోచించారు?
- మీరు ఎలాంటి అనుభూతి పొందారు?
- మీరు ఈ నిశ్శబ్ద సమయాన్ని ఆస్వాదించినట్లయితే మీ చేతిని పైకి ఎత్తండి?
[శ్రీ సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక-కరోలే ఆల్డర్మాన్]