త్వరగా నిద్రలేవటం
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి…. పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి. |
(మీకు అవసరమైతే) వినటానికి మృదువైన నేపథ్య సంగీతాన్ని పెట్టండి.
సుఖాసనంలో కుర్చీలో కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి.
వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.
మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
కళ్ళు మూసుకోండి. మీకు అది అసౌకర్యంగా ఉంటే నేలవైపు చూడండి.
మళ్లీ దీర్ఘ శ్వాస తీసుకోండి.
ఉదయం మీరు మంచం మీద వున్నారని వూహించుకోండి.
మీ అమ్మ మిమ్మల్ని లేవమని పిలుస్తోంది.
పాఠశాలకు వెళ్ళటానికి లేచే సమయము అయిందని అని మీకు తెలుసు.
మీకు పరుపు పై వెచ్చగా, ఇంకా కాసేపు పడుకోవాలని అనిపిస్తుంది.
మీరు త్వరగా నిద్ర లేచినట్లుగా, హడావిడి లేకుండా, పాఠశాలకు ఆలస్యం కాకుండా వెళ్ళావని వూహించుకోండి.
మీరు త్వరగా నిద్రలేవటం అమ్మకు చాలా సంతృప్తి కల్గిస్తుంది.
మీరు హడావిడి పడాల్సిన అవసరం లేదు.
త్వరగా లేవాలన్న మీ ఆలోచన మీకు మంచి ఆనందా నుభూతిని కల్గిస్తుంది.
మంచిగా వున్నందుకు మీ వెన్ను మీరు తట్టుకోండి.
కొద్దిసేపు తర్వాత ఇప్పుడు నేను చిన్నగా చేసే గంటల శబ్దంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.
[సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక. -కరోలే ఆల్డర్మాన్]