అన్ని ప్రాణులను ప్రేమించుట
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి…. పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి. |
(అవసరమైతే) నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని వినటానికి పెట్టండి.
ఒకవేళ అనుకూలంగా ఉంటే మధ్యలో ఒక అడుగు స్థలం ఉండేలాగా వృత్తాకారంలో పిల్లల్ని కూర్చోబెట్టండి.అలా లేనిచో వారిని కుర్చీలో కానీ లేదా సుఖాసనంలో కానీ కూర్చోమనండి.
వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.
మెల్లగా, దీర్ఘంగా శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.
కళ్ళు మూసుకోండి, మీకు అసౌకర్యంగా ఉంటే, నేలవైపు చూడండి.
మళ్ళీ దీర్ఘ శ్వాసను తీసుకోండి.
మీరు వూరి బయట నడుస్తున్నట్టుగా ఊహించుకోండి.
ప్రకృతి ఎంతో అందంగా కనపడుతున్నది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
మీరు ఒక పెద్ద చెట్టును చూసి, దాని చల్లటి నీడలో కూర్చోవాలని నిర్ణయించుకున్నారు.
చూడండి.అక్కడ ఒక కుందేలు పిల్ల గడ్డిని తింటోంది.
అంతేకాక ఆ చెట్టు మీద ఉడత ఉంది.
దూరంగా కొన్ని జింకలు గడ్డి మేస్తున్నాయి.
అక్కడ చాలా జీవులు నివసిస్తున్నాయి. వాటిని చూస్తూ నీవు ఎంతో ఆనందిస్తున్నావు.
నువ్వు నిశ్చలంగా నిశ్శబ్దంగా ఉన్న యెడల, అవి నీ దగ్గరకు వస్తాయి.
వాటిని గడ్డి తిని ఆడుకోనివ్వండి.
వాటిని పట్టుకుని ఇంటికి తీసుకెళ్లాలని ప్రయత్నించకు. ఎందుకంటే అది వారి ఇల్లు.
అవి సంతోషంగా ఉన్నాయి. నీవు సంతోషంగా ఉన్నావు. కొద్దిసేపు తర్వాత ఇప్పుడు నేను చిన్నగా చేసే గంటల శబ్దంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.
చర్చ:
(పిల్లల ఏకాగ్రతకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.)
- మీరు ఏమి చూశారు?
- మీరు ఏ విధమైన అనుభూతిని పొందారు?
[సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక -కరోలే ఆల్డర్మాన్]