ప్రకాశ వంతమైన ఆలోచన
గురువు పిల్లలకు రాధ-కృష్ణుల గురించి నల్లబల్ల (Black Board) మధ్యలో వ్రాయించి గట్టిగా చెప్పమని అడుగ వలెను.
తర్వాత పిల్లలను వారిరువురికి సంబందించిన పదములను మాట్లాడమని అడగవలెను.
ఉదాహరణకు నీలము, నెమలి పించము యొక్క ధారణ, వేణువు, గోపికలు, భక్తులు. ఈ విధమైన పదములను వారు బోర్డు మీదతో పాటుగా నోటు పుస్తకములలో కూడా వ్రాయమని అడగాలి. ఇందులో ఎటువంటి అంకెలు ఇవ్వడం కానీ లేక ఇన్ని పదములు మాత్రమే వ్రాయవలెనన్న ఆంక్ష లేమి ఉండకూడదు. వారి వారి ఆలోచనలను బట్టి ఎన్ని పదములైనను వ్రాయవచ్చును.
ముఖ్య గమనిక: ఇక్కడ పిల్లల నుండి పదములు రావలెను కనుక గురువులు వారు వ్రాసినటు వంటి పదములలో ఇచ్చినటువంటి అంశమునకు సరిపోనిచో ఆ పదము ఎందుకు వ్రాశారో పిల్లల ద్వారా కనుక్కోవాలి. అంతే కానీ ఈ పదము ఈ అంశమునకు సరియైనది కాదు అని ఖండించకూడదు.