చూపు – చిరునవ్వు
ప్రియమైన పిల్లలూ!
చిరునవ్వు నవ్వండి.. కళ్ళు మూసుకోండి. మీ ముందు చిరు నవ్వుతో నిల్చున్న బాబాను చూడండి.
చూపు – చిరునవ్వు
ప్రియమైన పిల్లలూ!
చిరునవ్వు నవ్వండి.. కళ్ళు మూసుకోండి. మీ ముందు చిరు నవ్వుతో నిల్చున్న బాబాను చూడండి.
స్వామి అంటారు “ఎప్పుడూ సంతోషంగా ఉండండి” అని. మనం నవ్వితే ప్రపంచం మనతో పాటు నవ్వుతుంది. మనము మన తల్లి తండ్రుల ను, ఉపాధ్యాయులను సంతోష పడే విధంగా చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు. అందరూ సంతోషంతో వెలిగే ముఖాలను చూడాలనుకుంటారు. సంతోషం చిరునవ్వు వలె ప్రతి స్పందన తెస్తుంది. మనం ఎవరినైనా సంతోష పెడితే మనకు అది రెట్టింపై వస్తుంది. మనం నవ్వినా కొద్దీ మన సంతోషం పెరుగుతుంది.
“చిరునవ్వు నవ్వండి! నవ్వండి! నవ్వండి!.
రోజంతా నవ్వండి! నవ్వండి! నవ్వండి! నవ్వండి!
ప్రపంచం కూడా నవ్వుతూ ఉంటుంది!
మన అమ్మ చిరునవ్వు మనకు ఆనందం కలగజేస్తుంది. తండ్రి చిరునవ్వు మనలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. గురువుల చిరునవ్వు అంగీకారాన్ని తెలుపుతుంది. స్నేహితుల చిరునవ్వు వారికి మనపై గల ప్రేమను తెలుపుతుంది.ప్రతి చిరునవ్వు మన హృదయాన్ని తాకి హృదయ కవాటాలను తెరుస్తుంది. ఎప్పుడూ చిరునవ్వు తో ఉండండి.. భగవంతుడు మన నుండి కోరేదదే.. సహాయ పడడం లో , ఇవ్వడంలో, సేవలో, వినడం లో, జీవించడంలో ఆనందం పొందండి. ఆ చిరునవ్వు తో కళ్ళు తెరవండి.