శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య జీవితము మరియు సందేశముపై క్విజ్
ఐదవ భాగము
- భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతరణ గురించి చేసిన ప్రవచనాలు ఏమిటి?
జ:
I. శ్రీ సత్యసాయి బాబా వారు కలియుగ అవతారి. నేడు మనదేశంలోనే కాక, విదేశాల్లో కూడా మిలియన్ల కొద్ది ప్రజలు దీనిని విశ్వసిస్తున్నారు. భగవంతుడు శ్రీ సత్య సాయిబాబాగా అవతరిస్తారని అనేక వేల సంవత్సరాల క్రితమే, అనేకమంది దివ్య పురుషులు, మహనీయులు ప్రవచించారు. శ్రీ సత్య సాయి అవతరణ ప్రపంచ ఆధ్యాత్మిక పునరుజ్జీవన స్వర్ణ యుగానికి నాంది పలికింది. ఈ అవతార లక్ష్యం నైతికంగా అధోగతి చెందుతున్న మానవాళిని ఉద్ధరించుట మరియు మానవాళినంతటినీ ఏక కుటుంబంగా చేర్చుటయే.
దీనికి మూలం ద్వాపర యుగంలో మొదలైంది. పాండవుల అరణ్యవాస సమయంలో మార్కండేయ మహర్షి వారిని సందర్శించి “శ్రీమహావిష్ణువు కలియుగంలో దక్షిణ భారతదేశంలో మానవ రూపంలో, కృష్ణవర్ణాన్ని కలిగి అవతరిస్తారని ప్రకటించినట్లుగా” వారికి తెలియజేశారు. ఆ అవతారము అనుహ్యమైన మానవ రూపాన్ని పొంది, అన్నింటినీ సృష్టించే గొప్ప శక్తిని, జ్ఞానాన్ని కలిగి ఉండి శాంతిభద్రతలను పునరుద్ధరింప చేస్తుంది అని చెప్పారు. ఈ సత్యాన్ని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఒక భక్తుడికి చిత్రావతి నదీ జలాల ప్రతిబింబంలో దశావతారాల్లోని ముందు తొమ్మిది అవతారాలను మరియు చివరి అవతారమైన కల్కి అవతారాన్ని శ్రీ సత్య సాయి అవతారంగా చూపించారు.
యూ.ఎస్.ఏ కి చెందిన మిస్టర్ హిల్డా చార్ల్టన్ సాయి అవతారం కల్కి అవతారంగా ప్రశాంతి నిలయంలో మరొకసారి ధ్రువీకరించారు. ఒకసారి భజన సమయంలో స్వామి సింహాసనం పై కూర్చుని ఉండగా స్వామి తలపై తెల్లని గుర్రం పై స్వారీ చేస్తున్న సుందర రూపాన్ని ఆయన దర్శించినట్టుగా తెలిపారు.
II. 5000 సంవత్సరాల క్రితం వ్రాయబడిన శుకనాడి గ్రంథ తాళపత్రాలలో శ్రీ సత్యసాయి బాబా వారి గురించి ప్రవచించబడినది.
ఇందులో స్వామి వారి కుటుంబానికి సంబంధించిన వివరములు, స్వామివారి జన్మించిన మాసము, తిథి, జన్మ నక్షత్రము, లగ్నము, గ్రహముల కలయిక, స్వామి వ్యక్తిత్వము, షిరిడి సాయిబాబా గా స్వామిపూర్వతారము గురించి, స్వామి సంస్థల వివరముల గురించి, స్వామి యొక్క దివ్య శక్తి గురించి ప్రవచించ బడ్డాయి.శుకనాడి గ్రంథంలో సత్య సాయిబాబా ప్రజల సమస్యలను, ఇబ్బందులను పోగొట్టి వారిలో అంతర్లీనంగా ఉన్న దివ్యత్వాన్ని గ్రహించేలా చేస్తారని తెలియజేయబడినది. అతను సర్వజ్ఞుడు. సర్వాంతర్యామి. శుకనాడీ గ్రంథంలో సత్యసాయి బాబా వారు దివ్య శక్తులు కలిగి ఉంటారని, అధర్మము అభివృద్ధి చెందుతున్నప్పుడు వారి దివ్య శక్తులు వ్యాప్తి చెందుతాయని ప్రస్తావించబడినది. సామాన్యంగా మానవ శరీరం ఎన్ని సంవత్సరాలు జీవించగలదో, శ్రీ సత్య సాయిబాబా వారు కూడా అన్ని సంవత్సరములు ఉంటారని ప్రస్తావించబడినది.
III. యేసు స్వామి అవతరణను గూర్చి చేసిన మరొక ప్రవచనము: “నన్ను పంపిన వాడు మళ్ళీ వస్తాడు. ఆ ప్రభువు సత్యమైన నామమును కలవాడు. ఎర్రని వస్త్రం ధరిస్తాడు. ఆయన శిరస్సు మీద వెంట్రుకలు కిరీటము వలె ఉంటాయి”. యేసు చెప్పిన ఈ ప్రకటన శ్రీ సత్యసాయి బాబాను సూచిస్తుంది.
IV. అగస్త్య నాడి గ్రంథంలో బాబాను గొప్ప సమర్థత కలిగిన వైద్య గురువుగాను. నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న వారికి తక్షణ నివారణ ప్రసాదిస్తారని తెలిపింది. వారు అనేక విద్యా సంస్థలను స్థాపిస్తారు. ధార్మిక జీవితం గురించిన గ్రంథాలను ప్రచురిస్తారు. మానవులలో ఆధ్యాత్మిక తత్వాన్ని పెంపొందింప చేస్తారు. వారు చిన్న వయసులో ఇంటిని వదిలిపెడతారు. పూర్వజన్మలో షిరిడి సాయిబాబాగా అవతరిస్తారు అని తెలియజేయ బడినది.
V. బ్రహ్మనాడిలో పుట్టపర్తి లోని ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి శివశక్తి రూపంగా అవతరిస్తారని మరియు అతను శ్రీకృష్ణుని పునర్జన్మ అని, మూడు అవతారాలను దాలుస్తారని తెలుపబడింది.
VI. కాలజ్ఞానంలో శ్రీ సత్య సాయి అవతారం గురించి ప్రవచించబడినదని, కర్ణాటకలోని కైవారానికి చెందిన యోగి నారాయణ యతీంద్రులు తెలిపారు. ఈ అవతారం అత్యుత్తమమైనదని, బ్రహ్మవిద్యను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, విమల విజ్ఞానాన్ని కలిగియున్నదని తెలిపారు. ఈ అవతారంలో ఉపనయనములు జరిపించట, పేదలకు వివాహములు జరిపించటంమ, ప్రార్థనా స్థలములను నిర్మించటం జరుగునని తెలిపారు. అన్ని మతాల ప్రజలు అతని ద్వారా ప్రయోజనం పొందుతారని తెలిపారు. ఇవన్నీ శ్రీ సత్యసాయి అవతారంలో నెరవేరాయి.
VII. యూదుల జ్యోతిష్కుడైన నోస్ట్రాడామస్ “రాబోయే జగత్ పరిపాలకుడు దక్షిణ భారతదేశంలో జన్మిస్తాడు. గురువారములు అతను పవిత్ర దినములుగా భావిస్తాడు. ఆయన యెక్క అనంతమైన జ్ఞానానికి, శక్తికి ప్రపంచమంతా ఆయనను అభినందిస్తాయి” అని పేర్కొన్నారు.
VIII. మహమ్మద్ ప్రవక్త ప్రసంగాలైన “ది ఓషన్ ఆఫ్ లైట్” అనే గ్రంథంలో బాబా గురించి ఈ విధంగా పేర్కొనబడినది. ఆయన ఈ జగత్తుకు ప్రభువుగా ఉంటారు. ఆయన శిరోజాలు దట్టంగా ఉంటాయి. నుదురు విశాలంగా ఉంటుంది. బుగ్గ మీద పుట్టుమచ్చ వుంటుంది. ఆయన రెండు వస్త్రములు ధరిస్తారు. ఆయన వస్త్రము అగ్ని జ్వాల వలె ఉంటుంది. ఆయన ముఖ కాంతి ఒకప్పుడు రాగి రంగులో, ఒకప్పుడు బంగారు రంగులో, ఒకప్పుడు శ్యామల వర్ణంలో, ఒకప్పుడు చంద్రబింబం వలే ఉంటుంది. ఆయన భక్తుల మధ్యకు వెళ్లి తిరుగుతారు. అతడు సమస్త లోకాలకు దయామయుడై వుంటాడు. అతని అవతార పరిసమాప్తికి 9 సంవత్సరాల ముందు మాత్రమే మహమ్మదీయులు అతనిలోని దివ్యత్వాన్ని గుర్తిస్తారు. ఆయన తన శరీరం నుండి వస్తువులను సృష్టిస్తారు. ఆయన నోటి నుండి శివలింగాలు ఆవిర్భవిస్తాయి. ఈ విధమైన లక్షణాలు అన్ని సత్యసాయి బాబా వారికి స్పష్టంగా సరిపోయేవిగా ఉన్నాయి.
IX. 22 వ పోప్ జాన్, ఎర్రటి వస్త్రంతో, మంచి ఛాయ కలిగిన, చెప్పులు ధరించని వ్యక్తి వాటికన్ ను స్వాధీనం చేసుకుంటాడని జోస్యం చెప్పారు. స్వామి అవతారంలో కూడా “నేను వచ్చాను” అని ప్రకటించారు.
i. అమరత్వము మరియు అన్యాయము, దురాశ మరియు అసూయల నుండి దూరంగా ఉన్నప్పుడు ప్రేమ పూర్వకమైన సౌమ్యతను కలిగి తద్వారా ఆధ్యాత్మిక సాధన అనే రాజమార్గంలోని వెళ్ళగలము,
ii. వ్యక్తి యొక్క పురోగతికి, సామాజిక పురోగతికి సాధనాలు సత్యం, ధర్మం, శాంతి మరియు ప్రేమ యొక్క విలువలను అనుసరించటం.
iii. మంచి వ్యక్తుల హృదయాలలో విశ్వాసము మరియు సంతృప్తి ఉన్నప్పుడు భయము మరియు ఆందోళనలను పార ద్రోలవచ్చు.
- అరిజోనా విశ్వ విద్యాలయానికి చెందిన హెరాల్డ్ బరనోవస్కీ చేసిన పరిశోధన ఏమిటి?
జ:
అతను తన కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా ఆరోనమీ శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. పుట్టపర్తిలో భగవంతుడు అవతరించాడు అని నిరూపించాడు. హెరాల్డ్ బరనోవస్కీ చాలా మంది ప్రముఖుల ఆరాను అధ్యయనం చేశాడు. కానీ అతను “బాబా నుండి వెలువడే ఆరా అతీంద్రియమైనది, నమ్మశక్యం కానిది అని పేర్కొన్నాడు. బరనోవస్కీ బృందావన్లో ఉండి తన కిర్లియన్ కెమెరా ద్వారా బాబా యెక్క ఆరాను అధ్యయనం చేశారు. ఎల్లవేళలా బాబా శరీరం నుండి గులాబీ రంగులో కనిపించే ప్రేమ యొక్క దివ్య తరంగాలు కనీసం 300 అడుగుల దూరం వరకూ విస్తరించి, దాదాపు 3000 మంది భక్తులను ఆవరించి ఉండటం చూశాడు. అతను బాబా నిజంగా భగవంతుడు అని, నిర్మలమైన ప్రేమ స్వరూపం అని చెప్పాడు. ప్రేమయే దైవము. దైవమే ప్రేమ అని స్వామి గురించి పేర్కొన్నాడు.
- సాయి త్రయము గురించి బాబా ఏమి వివరించారు?
జ:
స్వామి తమ మూడు అవతారాలను ఇలా వివరించారు.
మూడు అవతారాలైన షిర్డీ సాయి, సత్యసాయి మరియు ప్రేమసాయిల ఏకత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఈ మూడు అవతారాలలో దివ్య శక్తులు, అవతార కార్యక్రమాలు ఒకే విధంగా ఉంటాయి. కాలమాన పరిస్థితులను బట్టి కొన్ని తేడాలు ఉండవచ్చు. షిర్డీ సాయి అవతారము లౌకిక మరియు ఆధ్యాత్మిక ఏకీకరణకు ఆధారంగా చేసుకుని తన సందేశాన్ని ‘కర్తవ్యపాలన’ అని తెలియజేస్తుంది. సత్యసాయి అవతారం యొక్క లక్ష్యం ప్రతి మానవుడిలో దాగి ఉన్న దివత్వాన్ని గ్రహించడం మరియు ప్రతి ఒక్కరికి సహాయం చేయడం. అందువలన చేసే సేవ ‘ఆరాధనగా మారాలి’ అన్న సందేశాన్ని తెలియజేస్తుంది. మూడవ అవతారము ప్రేమ సాయి అవతారము. మనిషి తానే భగవంతుడు అనే జ్ఞానాన్ని గ్రహించేలా చేస్తుంది. ఈ మూడు అవతారముల లక్ష్యం కర్తవ్య పాలనను (కర్మను). ఆరాధన భావాన్ని(భక్తిని) మరియు జ్ఞానాన్ని అందించుటకై అవతరించాయి.
- SAI అనే పేరులోని మూడు అక్షరాల ప్రాముఖ్యతను స్వామి ఎలా వివరించారు?
జ: బాబా ఒకసారి 13-8-1978 లో ఇలా ప్రకటించారు
i) సోహం అంటే అర్థం “అది నేనే” అని.
SAI లో అంతర్లీనంగా ఉందని నమ్మండి
S అంటే సాయి
A అంటే ఏకము
I అనగా అనంతముSAI అనే పేరు మీకు తత్వమసిని గుర్తు చేస్తుంది. సాయి, నేనూ ఒకరమే.
ii) SA అంటే ఎప్పుడూ చూడు.
I అనగా నన్ను. SAI అనగా ఇప్పుడు నన్నే చూడు అని అర్థం.iii) ఇటీవల 18-11-1995 బాబా తాను మానవాళిలో తీసుకురావాలని నిర్ణయించుకున్న పరివర్తన మూడు విధములుగా తన పేరులోనే ఇమిడి యున్నదని చెప్పారు.
S అనగా ఆధ్యాత్మిక పరివర్తన,
A అనగా సామాజిక పరివర్తన,
I అనగా వ్యక్తిగత పరివర్తన.iv) బాబా సందర్భంలో 18-12-95 SAI లోని మూడు అక్షరాలు కర్మ, భక్తి, జ్ఞానములను సూచిస్తాయని ఈ క్రింది విధంగా తెలిపారు.
S అనునది సేవా కార్యకలాపములను (పనిని)
A అన్నది ఆరాధనను(భక్తిని)
I అనునది జ్ఞానమును తెలియజేయును.కనుక SAI అనేది ఆధ్యాత్మిక సాధన యొక్క మూడు రూపాలను సూచిస్తుంది, దానిని మనమందరం ఆచరించాలని ఆయన కోరుకుంటున్నారు.
EXTRACTED FROM THE WEBSITE OF PRASHAANTHI NILAYAM SRI SATHYA SAI BOOKS & PUBLICATIONS TRUST