స్వామి చిన్ననాటి లీలలు
ఆహారం అమితంగ వృద్ధిపొందుట
తొలిదశలో పుట్టపర్తి గ్రామంలో స్వామి తాను ‘సాయిబాబా’ ను అని ప్రకటించుకొన్న తరువాత ఉరవకొండనుండి పుట్టపర్తికి తిరిగివచ్చి తిరిగివచ్చి కరణం సుబ్బమ్మ ఇంట్లో ఉండేవారు. ఆమె ప్రేమ వాత్సల్యాలతో స్వామిని లాలించి పాలించేది. భక్తులందరిని తన విశాల గృహంలోకి మనసార ఆహ్వానించేది.. భక్తులసంఖ్య ఎక్కువైన కొద్దీ క్రమంగ ఒక షెడ్ నిర్మించారు. అది కూడ కొన్ని నెలలకి ఇంకా పెద్దది చేయవలసి వచ్చింది. ఏది ఏమైనా స్వామి తన దర్శనానికి వచ్చిన వారందరికి భోజన సదుపాయాలు చెయ్యాలని నిశ్చయంగ చెప్పేవారు. సుబ్బమ్మగారింట్లో ఒకవృద్ధురాలు ఒక అద్భుతమైన అనుభవం చెప్తారు. తరచుగ భక్తులకొణకై వండినవంట చాలదేమో అనిపించినపుడు బాబా రెండు కొబ్బరికాయలను తెమ్మని ఒకదానితో ఇంకొకటి కొట్టి ఆ కొబ్బరినీటిని ఆ వండిన ఆహారంపై చల్లేవారు. అలా చల్లి వడ్డించమని అనుజ్ఞ ఇచ్చేవారు. అది ఎంతమందికైనా సరిపోయేది.
కల్పవృక్షం
యాత్రికుల సంఖ్య క్రమంగ బాగా ఎక్కువయింది భజన, ప్రార్థనలు చేయటానికి పాతషెడ్ సరిపోలేదు.ప్రతిరోజు సాయంత్రం బాబా తన భక్తబృందాన్ని చిత్రావతీ నదీ తీరానికి తీసికొనిపోయి అక్కడ భజనలు చేయించేవారు. చిత్రావతి ఎడమవైపు ఒడ్డున ఉన్న కొండ శిఖరంపైన ఒక చింతచెట్టుండేది. అక్కడ అది ఒకే ఒక చెట్టు. బాబా తన భక్తులందరిని ఆచెట్టు దగ్గరకు తీసికొని వెళ్లి దానినుండి వివిధరకాల పళ్లను కోసేవారు. ఒక కొమ్మనుండి ఆపిల్పళ్లు, ఇంకొక కొమ్మనుండి | మామిడి, మరియొక దానినుండి బత్తాయి, బేరీ, ఫిగ్ పళ్లు ఇంకొక కొమ్మనుండి | ఇలా ఎన్నోరకాల పళ్లను కోసివారికి ఇచ్చేవారు. అప్పటినుండి ఆచింతచెట్టుకి | కల్పవృక్షమనే పేరువచ్చింది. ‘నేను ఎప్పుడైనా ఏచెట్టునైనా కల్పవృక్షంగ మార్చగలను’ అని స్వామి చెప్తారు.
ఆచింతచెట్టున్న కొండపై వేలాది భక్తులకు స్వామి ఎన్నో దివ్యదృశ్యాలు చూపించారు.కొందరు బాబా శిరస్సు చుట్టు కాంతిచక్రాన్ని చూచారు. కొందరు బాబానుదుటినుండి కళ్ళు మిఱుమిట్లు కొలిపే కాంతి కిరణపుంజం వచ్చుట చూచారు. మఱికొందరు ఒకపెద్ద షిర్డిసాయి రూపం వర్ణించరాని కాంతితో ప్రకాశించుట చూచారు. సత్యసాయిబాబా ముఖం పూర్ణచంద్రునిలో కొందరు చూడగ ఇంకకొందరు అగ్నిస్తంభాన్ని చూచారు. కొందరు భక్తులకు స్వామి దశావతార దర్శనం ఇచ్చారు.
కృష్ణునిగ సాయి
ఒకనాడు ఒకచెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టి అందరికీ సంతోషం కలిగిస్తూ బాబా పెద్దగ ఊగుతున్నారు. కింద కూర్చున్న భక్తులను చూస్తూ ఉన్నట్లుండి ‘చూడండి’ అన్నారు. వాళ్ళుపైకి చూచేప్పటికి అక్కడ పూలతో చక్కగ అలంకరించిన ఊయెలపై గోపాలబాలుడైన బృందావన కృష్ణుడు దర్శనమిచ్చాడు. కొందరు స్పృహతప్పి పడిపోగ వారిని బాబా తాను సృష్టించిన అక్షతలు చల్లి మళ్ళీ వారిని స్పృహలోకి తెచ్చారు.
ఒకసారి కృష్ణభక్తుడైన ఒక వ్యక్తిని స్వామి కృష్ణుని మురళీగానం వినవలెనని ఉన్నదా అని అడిగారు. భక్తుని చెవి తన వక్షస్థలంపై పెట్టి వినుము అన్నారు. మృదుమధుర మురళీనాదం వినవచ్చింది. అహా! ఏమివింత! వేణువులె వంకరలేని తిన్నని హృదయం, అనవసరపు ఆలోచనలులేని ఖాళీ హృదయం కలిగి ఉండాలి. అని చెప్తారు స్వామి. వంకరబుద్ధులు అరిషడ్వర్గం (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు) లేకుండ ఉండాలి అని అర్థం. అప్పుడే ఆదేవదేవుని దివ్య హస్తాలలో మనం కూడ ఒక పనిముట్టుగ మారగలం.
వెంకమ్మ
స్వామి అక్కగారైన వెంకమ్మ స్వామిని ఒక కోరిక కోరింది. బాబా ఎన్నో భజనలు వ్రాసి పాడిన షిర్డిసాయి బొమ్మను ఒకటి తనకిమ్మని ఆమె అడిగింది. ఏదో ఒక గురువారంనాడు ఆమెకు అది ఇస్తానన్నారు బాబా. బాబా తాను చెప్పిన ఒక గురువారం కంటె ఒక వారం ముందు గురువారం నాడు ఉరవకొండకు వెళ్లారు. వెంకమ్మ ఏదో ఒకనాడు స్వామి తనకా బొమ్మ ఇస్తారులే అనేవిశ్వాసంతో అంతా మరచిపోయి హాయిగ ఉన్నారు. రాత్రి అయింది. పుట్టపర్తిలో అందరూ. నిద్రిస్తున్నారు. వీధి ద్వారం అవతలనుండి ఎవరో అమ్యాయి! అమ్మాయీ! అని పిలిచారు. ఆ పిలుపు మళ్లీ వినపడకపోవటంతో వెంకమ్మ వెళ్లి తలుపు తియ్యలేదు. ఎవరో పక్కయింటివాళ్లని పిలిచి ఉంటారు అనుకున్నారామె. ఆమె పడుకున్న గదిలో ధాన్యంబస్తాల వెనుక ఏదో గీరుతున్న ధ్వని వినవచ్చింది. ఎలుకో, పామో అయిఉంటుంది. అనుకున్నారు వెంకమ్మగారు. దీపం వెలిగించి వెతికారు ఏమివింత! షిర్డిసాయి బొమ్మ అక్కడ కనపడింది. ఉరవకొండలో ఉన్న బాబా ఆమెకు వింతపద్ధతిలో పంపిన బహుమతి అది. ఆ బొమ్మ జాగ్రత్తగ ఆమె జీవితాంతం దాచుకున్నారు.
ఎవరూ బాబాకు హానిచేయలేరు
గుడిసెకు నిప్పు
ఒకసారి స్వామియెడల అసూయ కలిగిన కొందరు స్వామి నిద్రిస్తున్న గుడిసెకు నిప్పు అంటించారు. బయట వరండాలో ఆరు నుండి తొమ్మిది సంవత్సరాలవయసుగల పిల్లలు పదిమంది నిద్రిస్తున్నారు. సత్యం పడుకున్న గది బయటనుండి తాళం పెట్టి దుండగులు గుడిసెకప్పుకి నిప్పుముట్టించారు. బయట పడుకున్న పిల్లలు రాజూ! రాజూ! అని అరిచారు. సత్యం కిటికీలోనుండి బయటకు తొంగిచూచి భయపడవద్దని చిరునవ్వుతో చెప్పాడు.
పిల్లలందరు కళ్ళుమూసుకుని రాజు! రాజు! అంటూ మంత్రం వల్లించినట్లు గట్టిగ చెప్తూవచ్చారు. కప్పుగడ్డితో చేసింది కాబట్టి పెద్దమంటలు మండుతోంది. ఉన్నట్లుండి పెద్దవాన కుండపోతగ కురిసింది. మంటలన్నీ ఆరిపోయినాయి. ఆ వర్షం ఆశ్చర్యంగ, ఆ గుడిసెఉన్న ప్రాంతంతప్ప చుట్టుపక్కల ఇంకెక్కడా లేదు.
పిల్లల సంతోషం వర్ణించ లేకుండ అయింది. రాజు! రాజు! ఎంతగొప్ప మహిమ! నువ్వు లేకుండ మేము జీవించలేము అన్నారు. “ధర్మ ఏవహతోహంతి – ధర్మోరక్షతి రక్షితః” అంటే ధర్మానికి హానికలిగిస్తే అది వారిని నాశనం చేస్తుంది. ధర్మాన్ని రక్షించినవారిని అది రక్షిస్తుంది” అని అర్ధం. ఈ గొప్ప సూత్రంలో నమ్మకం కలిగి ఉండండి అని స్వామి చెప్తారు.
పంచభూతములపై వివర్సనం. ఈ జరిగిన ఉదంతం మరునాడు సుబ్బముకి తెలిసింది. ఆమె గట్టిగ దుండగులను పట్టుకొన్నది. ఆ ఊరిలో ఉన్న భూములన్ని సుబ్బమ్మచే కనుక ఆమని అది తాగ్యవంతుడా . ఆ అధికారంతో దుండగులన్ని సుబ్బమ్మవే దిగొట్టమని ఆమె ఆదేశించింది. కాని సత్యం ఆమె చేతులు పట్టుకొని ‘నాకోసం వాళ్ళని శిక్షించవద్దు క్షమించు వాళ్ళని వెళ్లగొట్టవద్దు’ అని బ్రతిమాలాడు. ఆది స్వామిక్షమాగుణానికి, ప్రేమకు నిదర్శనం.
విషపూరితమైన గారెలు
తెలివితక్కువ తనంతో కొందరు స్వామికి విషంపెట్టడానికి ప్రయత్నించారు. అది ఒకపండుగరోజు. ఇద్దరు భక్తులతో కలిసి స్వామి ఆగ్రామంలోని కొన్ని ఇళ్లకు వెళ్లారు. ప్రతి ఇంట్లోనూ ఏదో కొద్దిగ తిన్నారు స్వామి. ఒక ఇంటివారు విషపూరితమైన ఆహారం తయారుచేశారు. స్వామి ఆ ఇంట్లోకి వెళ్ళి అమితమైన ఉత్సాహంతో ఆ ప్రత్యేకమైన వంటను (విషపూరితమైన దానిని) ఇంకా ఇంకా తెమ్మని అడిగారు. కాని తనతో వచ్చిన వారా పదార్థం తినకుండ చూచారు. సుబ్బమ్మ ఇంటికి తిరిగివచ్చిన తరువాత ఆ ఇంటివారు తనను ఆహ్వానించుటకు వెనుక ఉన్న దురుద్దేశమును అందరితో చెప్పి ఆవ్యర్ధ ప్రయత్నములోని వారి తెలివి తక్కువ తనమును విడమరచి చెప్పారు.
ఆ సంఘటనకు స్వామి మనసార నవ్వుకున్నారు. కొంతసేపైన తరువాత మొత్తం వడలను వాంతి చేసుకున్నారు. చుట్టు ఉన్నవారు అవి విషపూరితములా అని పరీక్షించారు. అవును!! అవి విషం కలిపినవే!! ఈ చర్య కేవలం తనకు హాని తలపెట్టే ఉద్దేశంతోనే కాదని, తాను విషంతిని తట్టుకోగలనా అనేవిషయం పరీక్షించాలనే ఉద్దేశంతో చేసిన పని అని స్వామి చెప్పారు. ఆ గృహిణిని స్వామి క్షమించుటే కాదు కొన్నాళ్ల తరువాత ఆమెకు కార్తికేయస్వామి విగ్రహమును కూడ బహూకరించారు. అపకారికి ఉపకారం చేయుటకింతకంటే గొప్ప ఉదాహరణ ఏమి ఉంటుంది?
అదే బాబా
ఈశ్వరమ్మగారికి స్వామి పెద్దగడ్డంతో ఉన్న ఒక ముసలి వ్యక్తిగ దర్శనమిచ్చారని ఆమె సుబ్బమ్మగారితో చెప్పారు. స్వామి “విను షిర్డి ఉనికి ఇక్కడ ఉన్నది” అని చెప్పారని కూడ ఆమె అద్భుతమైన అనుభవాన్ని వివరించారు. బరువైన చెక్కపాదుకలతో నడచి వస్తున్న అడుగులచప్పుడు కూడ అగదిలో ఉన్న ప్రతివారు వినకలిగారు. బాబా కూర్చున్న చోటికి వచ్చి ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. మొదట అడుగుల ధ్వని వినగానే ఈశ్వరమ్మ కొంచెం కోపంగ “ఎవరు ఆ చెప్పులు వేసుకొని లోపలికి వచ్చేది?” అని అడిగారు. ఇంద్రియజ్ఞానము అంత నిజంగాను, ఆదర్శనం అంత సత్యంగాను ఉండినది.
తల్లి అనుభవం ఇలా ఉండగ తండ్రి వెంకప్పరాజు ఇంకొక సంఘటనను చెప్పారు. ఒకనాటి సాయంత్రం పెనుకొండనుండి కొందరు సందర్శకులు వచ్చారు. వారిలో కృష్ణమాచారి అనే లాయరు కూడ ఉన్నారు. వెంకప్పరాజు మాయకధలన్నీ చెప్పి అమాయకులైన పల్లె ప్రజలను అపమార్గం పట్టిస్తున్న మోసగాడని వారు నిందించారు. వెంకప్పరాజుకి కోపం వచ్చి సందేహిస్తున్న వారికి తన దివ్యత్వాన్ని నిరూపించి వారిని నమ్మించమని సత్యాన్ని నిలదీశారు. సుబ్బమ్మకూడ ఈ సందర్శకులతో పాటు సత్యం అప్పుడు ఉంటున్న పెద్ద వెంకప్పరాజు ఇంటికి వచ్చారు.
అపుడు సత్యం వారందరిని ఒక లోపలిగదిలోకి తీసికొని వెళ్లి షిర్డి సమాధియొక్క సంపూర్ణ దృశ్యాన్ని దర్శింపచేశారు. కొన్నిమైళ్ళ విశాల బహిః ప్రదేశంలో కూర్చుని ఆ సుందర ప్రకృతిలో షిర్డిలో ఉన్న అనుభూతి వారందరికి కలిగింది. పూలతో అలంకరించబడి, సువాసనలు వెదజల్లుతున్న అగరువత్తుల పొగలమధ్య ఉన్న షిర్డి సమాధిని, ఒకమూల కూర్చుని తనలో తను జపం చేసుకుంటున్న ఒక వ్యక్తిని వారు చూచారు. బాబా అక్కడ ఉన్న హనుమంతుని గుడిని, దూరంలో ఉన్న మర్గోసా వృక్షాన్ని కూడ వారికి ప్రత్యేకంగా చూపించారు. ఆ గదిలోకి వెంకప్పరాజుని చిట్టచివరిగా తీసికొనిపోయారు. ఆయనకూడ బయటకు వచ్చేసరికి ఒక పరిణామం చెందిన వ్యక్తిగ అయినారు. సందేహించిన వారందరు క్షమాభిక్షను వేడుకున్నారు. ఆ రోజునుండి తల్లిదండ్రులైన ఈశ్వరమ్మ, వెంకప్పరాజులు కూడ తమ పదహారు సంవత్సరముల పుత్రుడైన సత్యం నిజంగా షిర్డిసాయిబాబా అవతారమే అని పూర్తిగ విశ్వసించారు.
ఒకసారి మద్రాసుకు చెందిన ఒక మహిళ తన కుమారుని అనారోగ్యం
మూలముగ ఎంతో నిస్పృహకు లోనైనారు. ఆమె తన పుత్రుని షిర్డిసాయిబాబా పటం ముందు . కొన్ని తరువాత ఆమెకు గురించి తెలిసింది. అప్పటికి ఆరోగ్యం చేకూరి బాగా పొడుగ్గా, లావుగ ఎదిగిన తన కుమారుని వెంట పెట్టుకొని ఆమె పుట్టపర్తికి వచ్చింది. బాబా వారిద్దరినీ చూడగానే తల్లితో “పదిహేను సంవత్సరాల క్రితం నువ్వు ఈతనిని నా సంరక్షణలో కదా” అన్నారు.
నిజంగ ఆ షిర్డిబాబానే మరల వచ్చారు. సర్వజ్ఞత్వ, సంపూర్ణమైన దయాగుణం, నిరాడంబరత్వం ఈ రెండు అవతారాలలోను సమానంగా అగుపిస్తాయి.