చెప్పులు కుట్టేవాడు
స్వామి ఇంకా 20 సంll ల వయస్సు లో ఉసప్పుడు జరిగిన ఈ సంఘటన ఆయన ప్రేమకు దయకు ఇంకొక నిదర్శనం. బెంగుళూరులో ఒక వీధిమూల చెప్పులు కుట్టుకుని జీవించే వాడొకడున్నాడు. అతను కూర్చునేచోటికి ఎదురుగా ఉన్న బంగళాలో అతనొకసారి బాబాని చూడటం జరిగింది. ఎన్నో కార్లు ఆ బిసంగళాలో కి పోతూవస్తూ ఉన్నాయి. అలాగే జన ప్రవాహం కూడ వస్తూపోతూ ఉన్నది. బయట రోడ్డుమీదికి వచ్చిన వారి ముఖాలు చాల సంతోషంతో వెలిగిపోతున్నాయి. కృష్ణావతారం గురించి సాయిబాబా అవతారం గురించి వారు మాట్లాడుకుంటున్నారు. ఆ చెప్పులు కుట్టేవాడు ధైర్యం చేసి గేటులోకి వెళ్లి హాలులోకి తొంగిచూశాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన కుర్చీమీద కూర్చొని ఉన్నారు స్వామి. కింద ఒకవైపు పురుషులు ఒక వైపు స్త్రీలు కూర్చుని ఉన్నారు. చెప్పులు కుట్టేవాడు స్వామి వైపు చూచాడు. సరిగ్గా ఆక్షణం లోనే స్వామి అతన్ని చూచారు. వెంటనే బాబా కుర్చీలోంచి లేచి చెప్పులు కుట్టేవాడు నిల్చుని ఉన్న ద్వారంవైపుగ వచ్చారు. అతని చేతిలో ఉన్న సగం ఎండిపోయిన పూలదండను అతడింకా ఇవ్వకముందే అతని చేతిలో నుండి తీసుకున్నారు. ఆ చెప్పులు కుట్టేవాడికి తమిళ భాష ఒక్కటే తెలుసు. స్వామి తమిళంలో “నీకేం కావాలి?” అని అడిగారు. అతని భావాలన్ని మాటల్లో కూర్చుని బయటకు చెప్పగల ధైర్యం ఆ ముసలివానికి బాబాయే కలిగించి ఉంటారు. ఏ మాత్రం సంకోచం లేకుండ వింటున్న వారంతా ఆశ్చర్యపోయేటట్లుగా “మాయింటికి వచ్చి ఏదైనా తీసికోండి” అన్నాడతడు బాలాతో . బాబా ప్రేమతో అతనీ వీపుతట్టి “ అలాగేవస్తాను’ అని మళ్లీ హాలులోకి వెళ్ళిపోయారు.
చెప్పులు కుట్టేవాడు చాలసేపు అక్కడే వేచి ఉన్నాడు. తన ఇల్లు ఎక్కడున్నదో బాబాకు చెప్పాలని, బాబా ఎప్పుడు తన ఇంటికి వస్తారో అడగాలని అతని ఉద్దేశం. బాబా వచ్చేప్పటికి తన ఇల్లు శుభ్రంచేసి బాబాని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండాలి కదా! కాని వెంటనే తన చెప్పులు కుట్టేచోట గుట్టగ పడవేసిన తోలుముక్కలు పాత చెప్పులు గుర్తుకువచ్చాయి. త్వరత్వరగ తను కూర్చునే వీధిమూల కి వెళ్ళిపోయాడు. అక్కడ గేట్లో వచ్చే సందర్శకుల గుంపులో అతడిని త్రోసేశారు. తన గుడిసెకు బాబా వొస్తానన్నారు అని చెప్తున్నా ఎవ్వరూ వినిపించుకోలేదు. వాళ్ళని లోపలకు వెళ్ళి బాబా తనగుడిసెకి ఎప్పుడు వస్తారో కనుక్కుని చెప్పమని అడిగారు. కొందరు అతన్ని చూచి నవ్వారు. కొందరు త్రాగి ఉన్నాడో లేక పిచ్చివాడో అన్నారు. రోజులు గడిచాయి. చెప్పులు కుట్టేవాడికి బాబాని తాను మళ్లీ చూస్తాను అనే ఆశ నశించింది.
హఠాత్తుగ ఒకరోజు ఆ ముసలి వాడి ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. పేవ్మెంట్ మీద తనవృత్తి చేసుకుంటున్నందుకు తనను శిక్షించుటకోసం ఏ అధికారులో పోలీసువారో వచ్చి ఉంటారని అతడు భయపడిపోయాడు. కాని వచ్చింది ఎవరు!! సాయిబాబా! స్వామి చెప్పులు కుట్టేవానిని తన కారులో ఎక్కించుకున్నారు. అతనికి ఒకటే కంగారు. తనగుడిసెకు త్రోవను డ్రైవరుతో చెప్పడానికి కూడ అతనికి నోట్లోంచి మాటరాలేదు. బాబాకి అన్నీ తెలుసుకదా! రోడ్డు ప్రక్కన కారు ఆపించి బాబా కారు దిగారు. ఆ మురికివాడలో చిన్నసందులో ఉన్న ఆ ముసలివాని ఇంటిముందుకి సరిగ్గా వెళ్ళి ఆగారు. చెప్పులుకుట్టేవాడు తన ఇంట్లో వారిని హెచ్చరించడానికి పరిగెత్తాడు. బాబా కొన్ని తీపి పదార్ధాలు, పళ్ళు సృష్టించి ఆకుటుంబ సభ్యులందరికీ ఇచ్చారు. గోడప్రక్కనే ఉన్న ఒక చెక్క బల్లమీద కూర్చున్నారు స్వామి.
ఆనందబాష్పాలు కారుస్తున్న ఆ చెప్పులు కుట్టేవానిని ఆశీర్వదించారు. అతడిని తృప్తి పరచేందుకై దగ్గరలో ఉన్న దుకాణం నుండి అతడు తెచ్చిన అరటిపండ్లు తీసుకున్నారు. మెల్లగ అక్కడనుండి కదలివెళ్లారు. అప్పటినుండి ఆ ఇరుగు పొరుగు ప్రాంతానికి ఆ గుడిసె యాత్రాస్థలమయింది.