ఏకనాథ్
ఏకనాధ్ మహారాష్ట్రంలోని పైథానలో జన్మించాడు, పుట్టగానే తండ్రిని కోల్పోయాడు. చిన్నతనంలోనే తల్లి పోయింది. తాతగారి వద్ద ఎంతో ప్రేమతో పెరిగాడు ఏకనాధుడు. తాతగారు దైవభక్తుడు. ఏకనాధ్ బాల్యంలో రామాయణ, భారతాలనుండి, పురాణాలనుండి కథలు విని ఎంతో శ్రద్ధగా విషయాలు ఆకళింపు చేసుకున్నాడు. ఒక్కొక్కప్పుడు తాతగారిని దైవత్వం గురించి గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నలు అడిగేవాడు. తాను విన్న విషయాలను అతి సూక్ష్మంగా విమర్శించేవాడు.
ఏకనాధ్నుకి వయస్సు పెరిగే కొలది, గురువు అవసరం తోచింది. ఒక రాత్రి భాగవత కథలు వింటున్న సమయంలో ఒక వాణి వినిపించింది “నీవు వెంటనే దేవఘడిలో ఉన్న జనార్ధనపంతులు వద్దకుపోయి ఉపదేశం పొందు” అని. ఆ ప్రకారం బయలుదేరి దేవఘడి చేరుకున్నాడు. జనార్దనపంతులు ఏకనాధుని తన శిష్యుడిగా స్వీకరించి, మొదట గుమస్తా పనులు చేయమన్నాడు. ఏకనాధ్ వినయవిధేయతలతో, శ్రద్ధతో తన కిచ్చిన పనిని చేస్తున్నాడు. ఒకనాడు లెక్కల్లో చిన్న తేడా కనుపించింది. కొంత సొమ్ము లెక్క తేలడంలేదు. ఎన్నో గంటలు ఏకాగ్రతతో పని చేసి ఆ సమస్యను పరిష్కరించాడు. సంతోషంతో గంతులు వేస్తూ పాటలు పాడడం ప్రారంభించాడు. గురువు ఈ శబ్దానికి మేల్కొని సంగతేమిటని అడిగాడు. ఏకనాధ్ విషయమంతా వివరించాడు. అదివిని గురువు జనార్దనపంత్, ఏకనాథ్ ఆధ్యాత్మిక ఉపదేశానికి తగిన శిష్యుడని నిర్ణయించాడు. “నాయనా ! లౌకిక విషయాల్లో ఏకాగ్రత వలన కొన్ని రూపాయల లాభం పొందావు. దీనిలో అణుమాత్రం మైనా ఏకాగ్రత భగవంతునిపై చూపితే, నీకు ఎనలేని శాశ్వత ఆనందము లభిస్తుంది. కాబట్టి అనిత్యమైన ఈ ప్రాపంచిక విషయాలనుండి, నిత్యసత్యమైన భగవంతునివైపు దృష్టి మరలించు” అని ఉపదేశం ఇచ్చాడు.
One day, he found a small mistake in his account. He was short of some money. He sat down to find the mistake and after seven hours of concentration, he found the mistake and he was so overjoyed that he danced around the room and sang loudly. The Guru was awakened. He saw Eknath in a state of ecstasy. He asked the cause of his rejoicing. When the Guru came to know the reason, he thought him fit for initiation. He told him then, “If concentration on worldly accounts has brought you a few pennies, a fraction of the same concentration on God will bring you illumination, so turn your attention from the world, which is transient (ever changing), to God, Who is eternal.” Eknath was initiated by his Guru into spirituality.
గురూపదేశం పొంది ఏకనాధ్ మార్కండేయ మహర్షి తపస్సు చేసిన తపోవనంలో తపస్సు చేశాడు. శ్రీకృష్ణ భగవానున్నిపై ధ్యానం చేసి కృష్ణ సాక్షాత్కారం పొందాడు. ఈ వ్యాస సమయంలో ఒక సర్పము ఏకనాధ్ శరీరంమీద ప్రాకి, కరవకుండా దిగి వెళ్ళిపోయింది. ఆ మహనీయుని స్పర్శతో దానికి కరిచే స్వభావం నశించిపోయింది.
ఏకనాథ్ తపస్సు ముగించి గురువుగారి ఆజ్ఞతో తీర్థ యాత్ర సాగించాడు. బృందావనం, ప్రయాగ, బదరికాశ్రమం మొదలైన పుణ్యక్షేత్రాలు దర్శించి గంగ, యమున, గోదావరి పవిత్ర నదుల్లో స్నానం ఆచరించాడు. 13 ఏళ్ళు తీర్థ యాత్రలు చేసి తిరిగివచ్చి గురువుగారి అభిమతాన్ని మన్నించి గిరిజ అను కన్యను వివాహం చేసుకున్నాడు. గిరిజ కూడా భర్తకు అధ్యాత్మిక సాధనలో తోడ్పడేది. ఏకనాథ్ జీవితంలో ఆదర్శంగా గ్రహించదగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
చిన్నవయస్సులోనివాడయినా ఏకనాథ్ భావోద్రేకా” లకు లోనయ్యేవాడు కాదు. ఎప్పుడూ ప్రశాంత సమస్థితిలో ఉండేవాడు. అతనికి ఎట్టి పరిస్థితుల్లోను కోపం వచ్చేదికాదు. ఏకనాథుని ద్వేషించి ఒక వ్యక్తి ఆయనమీద 108 మార్లు ఉమ్మి వేశాడు. కాని ఏకనాథ్ కోపం తెచ్చుకోక 108 మార్లు గోదావరిలో స్నానం చేసి వచ్చాడు. “మీకు ఎందుకు కోపం రాలేదు” అని ఎవరో అడిగితే, “నాకు మేలు చేసినవానిపై నా కెందుకు కోపము? సాధారణంగా ఒకమారు గోదావరి స్నానం చేసేవాణ్ణి ఈ మిత్రుని మూలంగా 108 మార్లు స్నానంచేసే భాగ్యం లభించింది అన్నాడు. ఉమ్మి వేసినవాడు పశ్చాత్తాపం చెంది ఏకనాథ్ను క్షమార్పణ వేడుకున్నాడు.
మరొకమారు ఒక వ్యక్తి ఏకనాథ్ న్ని అనేక మార్లు నిందించి, నిందించి అలసిపోయాడు. కాని ఏకనాథ్ చిరునవ్వుతో “మీరు ఎంతో అలసిపోయారు. మా ఇంటికి రండి భోజనం సిద్ధంగా ఉంది” అని ఇంటికి తీసుకునిపోయాడు. అక్కడ అ వ్యక్తి ఆఖరి అవకాశంగా ఏకనాథ్ భార్య గిరిజ వీపుమీదికి ఎగిరి కూర్చున్నాడు. ఏకనాథ్ ఆతృతగా “జాగ్రత్త ! నీవు హెచ్చరించాడు. మహా సాధ్వియైన గిరిజ “నాకు తెలియదా! చిన్నప్పుడు మన అబ్బాయి నా వీపుమీద ఆడుకునేవాడు కదా !” అనింది. ఇక ఆ మానవుని మనసితి ఊహించవలసిందే.
ఏకనాధ్ అతిసులభమయిన మరాటీ భాషలో బోధలు చేసేవాడు. తమ సభలకు ఉపన్యాసాలకు ఎవరూ రాకుండా ఏక్నాథ్ బోధలను అందరు వింటున్నారని మహాపండితు లందరు కినుక వహించి ఏకనాధుని తీవ్రంగా విమర్శించేవారు. ఇవన్నీ విని ఏకనాధ్ అన్నాడు. “నిందకులు (విమర్శకులు) గౌరవించదగినవారు, వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. నా పాపాలను క్షాళనం చేయడంలో వారు ఎంతో సహాయ పడుతున్నారు. పవిత్ర గంగానది మన ఇంటి ప్రక్కనే పారుతుం అంతకన్నా భాగ్యమేముంది? నాకు వారి మీద ఎటువంటి క్రోధములేదు” భగవంతుడు ఒక్క దేవాలయల్లోనేగాక, ప్రతి జీవిలో ఉన్నాడని ఏకనాథ్ అవగాహన చేసుకున్నాడు.
ఒకప్పుడు ఆయన శిష్యులతో ప్రయాగనుండి రామేశ్వరం వెళ్తూన్నాడు. దారిలో ఒక గాడిద ఎండ వేడికి తాళలేక దప్పికతో పడిఉంది. అది చూచి, తమవద్ద ఉన్న గంగాజలమంతా ఆ గాడిద గొంతులో పోసి దాని దాహం తీర్చాడు. శిష్యులు మాత్రం ఇది సహించలేక “స్వామి ! ప్రయాగనుండి పవిత్ర రామేశ్వరంలో అభిషేకానికి తీసుకుని వెళ్తున్నా ము . పవిత్ర జలం ఈ అధమి జంతువుకు అర్పిస్తారా?” అని అడిగారు. ఏకనాథ్ ఎంతో సౌమ్యంగా. “నాయన ఈ దప్పిక పొందిన జీవికి గంగాజలం ఇచ్చి రామేశ్వరునికి అభిషేకం చేసి పుణ్యం సంపాదించుకున్నాను, రామేశ్వరుడు కూడా తృప్తిపడ్డాడని నా భావన” అన్నాడు.
ప్రశ్నలు :
- ఏకనాధ్ కోపాన్ని జయించాడని ఎట్లు చెప్పగలవు?
- సకల జీవులలో భగవంతుడున్నాడని నమ్మిన ఏకనాధ్ ఆ సిద్దాంతము ఎట్లు ఆచరణలో పెట్టాడు.
[Illustrations by T. Reshma, Sri Sathya Sai Balvikas Alumina]
[Source: Stories for Children-II, Sri Sathya Sai Books & Publications, PN]