పురందరదాసు
కర్ణాటక సంగీతానికి మూలపురుషులలో ఒకడని పరందరదాసు ప్రఖ్యాతిపొందాడు. ఆయన 4,75,000 కీర్తనలను వ్రాశాడు. ఒక కీర్తనలో ఆయన అన్నాడు “కేదారం నుండి రామేశ్వరం వరకు అన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించి, 1,75,000 కీర్తనలలో భగవంతుడైన వాసుదేవుని గురించి , నా ఆధ్యాత్మిక గురువు వ్యాసరాయని గూర్చి కీర్తించాను”. ఎన్నో కొత్తరాగాలను సృష్టించిన ఖ్యాతి కూడా ఆయన పొందాడు.
పురందరదాసు కీర్తనలు ప్రఖ్యాత వాగ్గేయకారాడు త్యాగరాజుపై ఎంతో ప్రభావం చూపించాయి. దక్షిణ దేశంలో పురందరదాసు కీర్తన పాడని కచేరి ఉండదు. అ కీర్తనలలోని సంగీతమే కాక భక్తి భావంతో కూడిన సాహిత్యము కూడ చిరకాలం ఆరాధింపబడుతుంది, పాడబడుతుంది. ఆచరింపబడుతుంది.
క్రీ. శ. 1494 లో పూనా నగరానికి 18 మైన దూరంలో ఉన్న ‘పురందరఘడ’ అనే ఊరులో పురందరదాసు జన్మించాడు. అతని తల్లిదండ్రులు వరదప్పనాయకుడు, కమలాదేవి. వారు తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని ఆరాధించగా పుత్రుడు కలిగాడు. చేశారు. అతనికి శ్రీనివాసుడని నామకరణం చేశారు. బాలునికి విద్యతో పాటు సంగీతం, సంస్కృతం భాషాధ్యయనంకూడా చేయించారు. యుక్త వయసురాగా సరస్వతీబాయి అనే కన్యను ఇచ్చి వివాహం చేశారు.
శ్రీనివాసుడు నిరంతరం ధనార్జనలో ఆసక్తుడై ఉండేవాడు. ఈ వ్యాసంగంలో మిగిలినవన్నీ అతడు మరిచాడు. దైవ ప్రసక్తి అనేది లేదు. రానురాను అతని ధనాశ పెరుగుతూ వచ్చింది.. భగవంతుని మరచి బంగారాన్ని ఆరాధించాడు. ఒక కానీ కూడా ధర్మం చేసేవాడు కాదు. తన భార్య ఎక్కడ దానం చేస్తుందో అని కట్టడి చేశాడు. 9 కోట్లకు మించి ధనం కూడ బెట్టి నవకోటి నారాయణుడు అన్న పేరు పొందాడు.
హఠాత్తుగా అతని జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒక ముదుసలి శ్రీనివాసు దుకాణం వద్దకు వచ్చి, తన కుమారుని ఉపనయనానికి సహాయంగా కొంత ధనం యాచించాడు.
కాని శ్రీనివాసుడు ‘రేపురా చూస్తాను’ అని పంపించేశాడు. మరురోజు వచ్చాడు. ఆ రోజుకూడా అదే అయింది. ఆ విధంగా ఆరునెలలు అతనికి చిల్లిగవ్వ కూడా ఇవ్వక త్రిప్పాడు. వృద్ధుని రూపంలో ఉన్న భగవంతుడు శ్రీనివాసుని మనస్సు మార్చడానికి మరొక మార్గం అవలంబించాడు. ఆయన శ్రీనివాసుని ఇంటికిపోయి ఒంటరిగా ఉన్న సరస్వతీబాయిని సహాయం కోరాడు.
ఆమె ధరించిన రత్నాల ముక్కుపుడక ఇమ్మని ప్రార్ధించాడు. కరుణామయి అయిన సరస్వతీబాయి కాదన లేక పోయి ఇచ్చింది. వృద్ధుడు ఆమెను ఆశీర్వదించి వెళ్ళాడు. మరుసటిరోజు ఆ వృద్ధుడు శ్రీనివాసుని దుకాణానికి వెళ్ళి ముక్కు పుడకను తాకట్టు పెట్టి 400 కాసులు ఇమ్మన్నాడు. శ్రీనివాసుడు ముక్కుపుడకను ఉంచుకున్నాడు. ధనం ఇవ్వడానికి సందేహిస్తున్నాడు. వృద్ధుడు ఏమి మాట్లాడక వెళ్ళిపోయాడు. పుడకను ఇనప్పెట్టెలో దాచి, శ్రీనివాసుడు వెంటనే ఇంటికి వెళ్ళి భార్యను “ముక్కుపుడక ఏమ యింది” చూపమన్నాడు. ఆమె భయపడి రక్షించమని భగవంతుని ప్రార్థించింది. ధనం ఇవ్వడానికి సందేహిస్తున్నాడు. వృద్ధుడు ఏమి మాట్లాడక వెళ్ళిపోయాడు. పుడకను ఇనప్పెట్టెలో దాచి, శ్రీనివాసుడు వెంటనే ఇంటికి వెళ్ళి భార్యను “ముక్కుపుడక ఏమ యింది” చూపమన్నాడు. ఆమె భయపడి రక్షించమని భగవంతుని ప్రార్థించింది. “ఎన్నాళ్ళు మీరు ఈ ధనాశతో జీవిస్తారు ? మృత్యువు మనకోసం వచ్చినపుడు మనం ఉత్త చేతుల్తో పోవాలిగదా? భగవంతుని అను గ్రహం తప్ప నాకు మరేమీ అవసరంలేదు” అని వైరాగ్యంతో చెప్పింది.
శ్రీనివాసుడు ఇవేవీ వినిపించుకోక, దుకాణానికి పరుగెత్తి, తలుపులు తెరిచి ఇనప్పెట్టెను తెరిచి చూచాడు. అతని ఆశ్చర్యానికి అంతులేదు. తాను ముందు రోజు ఉంచిన రత్నాల ముక్కుపుడక అక్కడ లేదు. ఈ భగవద్విలాసానికి శ్రీనివాసుని మనస్సు మారిపోయింది. మారు మాట్లాడక ఇంటికి తిరిగివచ్చి, సరస్వతీబాయి పాదాలమీద పడ్డాడు.”సరస్వతి, నేను భగవంతుని ఎడ ఎంత అపచారం చేశానో! నా పాపాలకు నిష్కృతి లేదు. నాకు తల తిరుగుతూంది, కాళ్ళు వణుకుతున్నాయి. ఇంతటి వైరాగ్యాన్ని పొందిన నీవు ఎంతటి అదృష్టవంతురాలవో ? దుకాణంలో నగల పెట్టెలో ఉంచిన పుడక ఇక్కడి కెట్లు వచ్చింది ? జరిగినదంతా చెప్పి నా మనస్తాపం తీర్చు” అని వాపోయాడు.
సరస్వతీబాయి తాను వృద్ధుడికి పుడక ఇచ్చానని చెప్పింది. ఆ వృద్ధుడు పాండురంగడు కాక మరెవరు ?
ఇది విని శ్రీనివాసుడు దుఃఖంతో “రంగా! నేనెంత దురదృష్టవంతుణ్ణి ! దగ్గరకు వచ్చిన నిన్ను త్రోసిపుచ్చాను. స్వామీ ! నాకెప్పుడు మళ్ళీ దర్శనం ఇస్తావు ?” అని విలపించాడు. తన భార్య వృద్ధుడికి పుడక ఇచ్చిన స్థానం పవిత్రంగా భావించి అక్కడ భక్తితో కూర్చున్నాడు. ఆయన, భార్య మూడు రోజులు ఉపవాసం చేసి ఏకదీక్షగా పాండురంగణ్ణి ప్రార్థించారు. పాండురంగడు సరస్వతికి కనుపించి “నీ భర్త సర్వము వదిలివేసి హరిదాసుగా
(నిరంతరం “విష్ణునామం చేసే భక్తుడుగా) మారినపుడే అతనికి దైవ సాక్షాత్కారం లభిస్తుంది” అని చెప్పాడు.
భగవద్వాణి వినిపించింది కాని దైవదర్శనం కాలేదు శ్రీనివాసుకి. తన యావదాస్తి, ధనం దానంగా ఇవ్వడానికి అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాడు. సంపూర్ణ వైరాగ్యంతో అతని శరీరం మనస్సు నిండిపోయాయి. సర్వం త్యజించి భార్యతో నలుగురు బిడ్డలతో కాలినడకన సత్యాన్వేషణకై బయలు దేరాడు. దారిలో ఒక వృద్ధుడు కనుపించాడు ‘వ్యాసరాయ’ని వద్ద ఆధ్యాత్మిక ఉపదేశం స్వీకరించమని ఇచ్చాడు. తర్వాత పాండురంగిని సాక్షాత్కారం తప్పక లభిస్తుంది. శ్రీనివాస నాయకుడు, భార్యాబిడ్డలతో హంపి చేరుకొని, చక్రతీర్ధంలో స్నానం చేసి వ్యాసరాయస్వామి మఠం ప్రవేశించాడు. ఆ మహానుభావునికి నమస్కారము చేసి ఉపదేశము అనుగ్రహించమని అర్థించాడు. వ్యాసరాయడు అతనిని తన ఆశ్రమంలో ఉండమని, ఎటువంటి పరిస్థితులలో ఒకరి వద్దనుంచి ధనంకాని, వస్తువులు గాని కోరానని దేవుడు ఇచ్చిన దానితో తృప్తిపడతానని, భవిష్యత్తుకై దోచుకోవడము అనే ఆలోచనే పూర్తిగా విసర్జిస్తానని ప్రతిజ్ఞ చేయించాడు. వ్యాసరాయ గురువు శ్రీనివాసునికి ఒక తులసిమాల, కాలికి గజ్జెలు, చేతుల్లో తాళాలు, ఒక తంబుర ఇచ్చాడు. ‘ పురందర విఠల’ అనే నామాన్ని ఉపదేశంగా అనుగ్రహించాడు. ఆ నామాన్ని సదా కీర్తించి భగవంతునికి అంకితం చేయమన్నాడు. శ్రీనివాసునికి ‘పుందరదాసు’ అని పేరు పెట్టాడు. పురందరదాసు అనేక దివ్యక్షేత్రాలు సందర్శించి భగవంతుని అనుగ్రహము అనేక రూపాలలో అనుభవించాడు. అవే మానవునికి మోక్షమార్గాలుగా ఆయనకు గోచరించాయి. ఆయన కీర్తనలలో మోక్షానికై తపన, భక్తి ప్రవక్తులే శరణ్యమనీ, అహంకారంతో, మోహంతో కూడుకొన్న జీవితం వ్యర్థమయిందని, అనేక విధాలుగా వర్ణించాడు. ఈ కీర్తనలే పురందరదాసును ప్రముఖ భక్తుడుగా వాగ్గేయకారునిగా తెలియజేశాయి. సులభశైలి, ఉన్నతమైన భావసంపద, సాహిత్యపుష్టి పురందరదాసు కీర్తనలను ఎన్నటికీ మరవలేనివిగా చేస్తాయి. ఆధ్యాత్మిక సాహిత్య ప్రపంచంలో వీటికి ఒక ఉన్నత స్థానం ఏర్పడింది.
“వైరాగ్యము, పవిత్రత, భావశుద్ధి మానవుని భగవంతుని ప్రేమకు అర్హునిగా చేస్తాయి. భగవత్రేమయే ముక్తికి ” సోపానము”.
ఇదే పురందరదాసు బోధనలలోని సారాంశము.
సాక్షాత్తు నారదుని అవతారమే పురందరదాసు అని చాలా మంది విశ్వాసము.
ప్రశ్నలు:
- పురందరదాసు అసలు పేరేమి?
- మొదట ఆయన ఎటువంటి జీవితము గడిపేవాడు ?
- వృద్ధుని వేషంలో వచ్చిన విఠలుడు శ్రీనివాసుని మనస్సు ఎట్లు మార్చెసు ?
- పురందరదాసు కీర్తనలలోని విశిష్టత ఏది?
- How did he become a great composer and singer?
Illustrations: A. Harini, Sri Sathya Sai Balvikas Student.
[Source: Stories for Children II, Published by Sri Sathya Sai Books & Publications, PN]