చక్రవ్యూహ అంత్యాక్షరి
ఉద్దేశ్యము:
వివిధ మతముల భావనలను, సారాంశమును అర్థం చేసుకొనుట.
అనుబంధ విలువలు:
- జ్ఞాపకశక్తి
- ఆసక్తి
- ఏకాగ్రత
- పట్టుదల, దృఢ నిశ్చయము
కావలసిన వస్తువులు:
- ప్రింట్ చేసిన / ముద్రించిన చిత్రములు
- పెన్ / పెన్సిల్
- జవాబు కాగితములు
గురువు యొక్క ముందస్తు సంసిద్ధత
ఏమీ లేదు
ఏ విధంగా ఆడాలి?
- గురువు ముద్రించినటువంటి చిత్రమును ప్రతి ఒక్కరికి ఇవ్వాలి.
- అంత్యాక్షరి ఏ విధముగా ఆడాలో వివరించాలి. ఉదాహరణకు – BALARAM అనే పదము వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చేటువంటి పదము ఏది?
- అంతకుమునుపు వచ్చినటువంటి పదము యొక్క చివరి ఒకటి రెండు ఒకటి లేదా రెండు లేదా మూడు అక్షరములను (BALARAM) జాగ్రత్తగా గమనించవలెనని చెప్పాలి. ఎందుకనగా ఈ అక్షరములతోటే తదుపరి పదము ప్రారంభం అవుతుంది కాబట్టి అని వివరించాలి.
- ఉదాహరణకు Mecca లో ‘M’, Amritsar లో ‘AM’, Ramayan లో ‘Ram’ అంత్యాక్షరి ఆడిన విధముగా.
- క్రింది ఇచ్చినటువంటి చక్ర వ్యూహ చిత్రము నుండి హిందు, సిక్కు, క్రైస్తవ, ఇస్లాము మతమునకు సంబంధించిన 20 పదములను గుర్తించవలెను. అవి ఆ మతమునకు సంబంధించిన పండుగలు, గ్రంథములు, వ్యక్తులు, భావనలు ఏవైనా కావచ్చు.
QURAN తో ప్రారంభమైన క్రింది చిత్రము నుండి వివిధ మతములకు సంబంధించిన 20 పదములను క్రమ రీతిలో కనుగొనండి.
సమాధానములు:
- QURAN
- NANAK
- KEVALIN
- LINGAM
- MARY
- YASHODA
- DAMODAR
- RADHA
- HARI
- RIG
- GOSPEL
- LANGAR
- RAMZAAN
- NANDALAL
- ALLAH
- HANUMAN
- NAMADEV
- DEVKI
- INDRA
- RAMAYAN