అంగుళిమాలుడు
శరావతి నగరం చుట్టూ ఉండే అడవిలో అంగుళిమాలుడనే పేరుమోసిన దొంగ నివసించేవాడు. అతడు బాటసారులను హింసించి, వారివద్ద ఉండే ధనాన్ని, వస్తువులను దోపిడి చేసేవాడు. ఇతనికి భయపడి చాలామంది ఆ దారిన పోవడమే మానుకున్నారు.
అంగుళిమాలుడికి ఒక చిత్రమైన అలవాటు ఉండేది. బాటసారుల డబ్బు, వస్తువులు దోచుకోవడమే గాక వారి చిటికిన వ్రేళ్ళు తెగనరికి దండగాకట్టి మెడలో వేసుకొని తిరిగేవాడు.
ఒకనాడు బాటసారులకోసం చూస్తూ అంగుళిమాలుడు అడవిలో ఉన్నాడు. అతని కంఠమాలకు ఇంకా కొన్ని చిటికిన వ్రేళ్ళు కావలసి వచ్చింది. ఇంతలో ఒక సన్యాసి ఆ దారిన రావడం చూచి “ఓయ్! సన్యాసీ! ఆగు” అని సన్యాసి వెంట బడ్డాడు. కాని ఎంత పరుగెత్తినా ఆ సన్యాసిని అందుకోలేక పోతున్నాడు. “ఏయ్! సన్యాసీ అగు!” అంటూ అరుస్తున్నాడు. ఆ సన్యాసి ఎవరో కాదు గౌతమ బుద్ధుడు. ప్రశాంతంగా అన్నాడు, “నేను కదలడంలేదు కదిలేది నీవే”. అంగుళిమాలుడికి అర్ధం కాలేదు. “ఏమిటయ్యా నీ వనేది అన్నాడు.
బుద్ధుడు చిరునవ్వుతో “నాయనా! నీ మనస్సుకు నిల కడ లేక నీవు ఎప్పుడూ కదిలికలోనే ఉంటున్నావు” అన్నాడు. ఇది విని ఆ దొంగ తనలో అనుకున్నాడు. “ఓహో! నన్ను ప్రేమగా నాయనా అంటున్నాడే. నిజంగా ఇతనికి నా మీద వాత్సల్యం ఉందా?” పై కిమాత్రం “నే నెవరో తెలుసా? నీ ఉపన్యాసాలు కట్టి పెట్టి నీ చిటికిన వేయను ముందుకు చాచు. అది నేను త్రెంచుకుంటాను” అన్నాడు. బుద్ధుడు ఆప్యాయతతో” “అలాగా! నాయనా! తప్పక ఇస్తాను తీసుకో” అని తన రెండు చేతులు చాచాడు. “నీ వ్రేళ్ళేకాదు నీ ప్రాణం కూడా తీస్తాను” అని బెదిరించాడు దొంగ. “దానివల్ల నీ మనస్సుకు శాంతి కలిగితే తప్పక తీసుకో” అన్నాడు బుద్ధుడు.
దుర్మార్గులమీద ఈ విధంగా ప్రేమ, వాత్సల్యం చూపించిన మానవుణ్ణి అంగుళిమాలుడు ఇంతవరకు చూడ లేదు. వెంటనే బుద్ధుని పాదాలమీద పడి “స్వామీ! ఇంక బుద్ధుని నేను ఎవ్వరినీ చంపను” అని కన్నీళ్ళతో చెప్పాడు. బుద్ధుడు అతనిని లేవదీసి, బౌద్ధవిహారానికి తీసుకొని పోయి అనేతక పిండకానికి అధినేతగా చేశాడు.
అక్కడ ఉన్న బిక్షువులు ‘మరొక సోదరునికి స్వాగతం చెప్పారు. మరునాడు శరావతిరాజు ఆ మఠాన్ని సందర్శించాడు. బుద్ధుడు అతనిని “ఏదో పెద్ద సన్నాహం మీద బయలుదేరా రే?” అని అడిగాడు.“అవును స్వామి! ఈ అడవిలో అంగుళిమాలుడు నే గజదొంగ ఉన్నాడు. వానిని పట్టుకోడానికి బయలు చేరాను. మీ ఆశీర్వచనంకోసం వచ్చాను”. బుద్ధుడు “రాజా! ఒక వేళ ఆ దొంగ తన వృత్తి మానేసి సన్యాసి వలే జీవితం గడుపుతూ ఉంటే నీవేం చేస్తావు?” అని అడిగాడు. “స్వామి! అప్పుడు అతని పాదాలమీద వ్రాలి నమస్కరిస్తాను. అంగుళిమాలుడు సన్యాసిగా మారడం అసం భవం” అని రాజు గట్టిగా గట్టిగా చెప్పాడు. “అటు చూడు! మొక్కలకు నీరు పోస్తున్న సన్యాసి ఎవరో చూడు” అని చూపించాడు బుద్ధుడు.
రాజు అంగుళిమాలుని గుర్తించాడు “ఆహా! ఎంత ఆశ్చర్యకర మైన విషయము, నా శరీర బలంతో, బుద్ధిబలంతో జయించలేనివానిని మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చక జయించారు. బుద్ధభగవానుని ప్రేమ నిరంతరము ఈ మానవాళిని రక్షించుగాక”. అని బుద్ధుని పాదాలపై వ్రాలాడు.
ప్రశ్నలు:
- అంగుళిమాలుడని దొంగకు ఎందుకు పేరు వచ్చింది?
- బుద్ధుడు అతనిని ఏ విధంగా జయించాడు?
- ఆంగుళిమాలుడు మారడానికి నిజమైన కారణం ఏది?
[Source- Stories for Children-II Published by- Sri Sathya Sai Books & Publications Trust, Prashanti Nilayam]