కోపం యొక్క పర్యవసానం ఏమనగా మూడు నెలల ఆరోగ్యాన్ని మరియు సామర్ధ్యాన్ని కోల్పోవడం.
శ్రీకృష్ణుడు జరాసంధుని చంపడానికి బయలుదేరుతారు. కానీ జరాసంధుడు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి శ్రీకృష్ణుడు యుద్ధరంగం నుండి పారిపోతాడు. అనగా దీని అర్థం శ్రీకృష్ణుడు జరాసంధుని చూసి భయపడ్డాడా? కాదు. శ్రీకృష్ణుడు జరాసంధుని వధించటానికి తగిన మార్గాన్ని కనుగొనాలని అనుకున్నారు. అందుకే కృష్ణుడు ఒక వ్యూహం పన్నాడు. శ్రీకృష్ణుడు జరాసంధుని యుద్ధానికి పిలవడంతో, ఆగ్రహంతో శ్రీకృష్ణుని వెంబడించడానికి బయటకు వస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు యుద్ధరంగం నుండి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అనేక పర్యాయాలు చేయడంతో, జరాసంధుడు కోపంతో తన శక్తిని వ్యర్థం చేసుకుంటాడు. కోపం వలన మనిషి యొక్క శక్తి గణనీయంగా తగ్గిపోతుంది. అసూయ, కోపము మరియు ద్వేషము అనునవి కత్తెర లాంటివి. వాటితో మనిషి జీవితకాలం ముక్కలు చేయబడుతుంది. మానవ జీవితం తగ్గటానికి ప్రధాన కారణం అసూయ. అలాగే మనిషికి కోపం వచ్చినచో శరీరం మొత్తం వణికి పోతుంది. అతని రక్తం వేడెక్కుతుంది. ఆ రక్తం మళ్లీ చల్లబడటానికి మూడు నెలల వ్యవధి పడుతుంది. ఒక్క క్షణం కోపం వచ్చినప్పుడు, ఆరు నెలలు ఆహారం తీసుకున్నందు వల్ల వచ్చే శక్తి వ్యయం అవుతుంది. కోపం అనగా వ్యక్తిని బలహీనపరచు మార్గం. జరాసంధుడిని ఆ విధంగా క్రమపద్ధతిలో బలహీనపరచడం ద్వారా, శ్రీకృష్ణ పరమాత్మ అతనిని జయించగలిగాడు.
మీపై అపవాదు పడినప్పటికీ కూడా మీరు సమతుల్యతను కోల్పోకూడదు. అపవాదులను, వాటి చర్చలకు ఓర్పు వహించండి. ఆధ్యాత్మిక సాధనకు ప్రధాన శత్రువు కోపం అని విశ్వామిత్ర మహర్షి సెలవిచ్చారు. కోపం, గర్వం, ద్వేషం, అసూయల వలన ఏర్పడే అగ్ని జ్వాలలు, నిప్పు కంటే వినాశ కరమైనవి. అవి మనసులో తెలియకుండా ఏర్పడి, ఉదృతమైపోతాయి. బయట దూరంగా కనిపించే మంటలకి భయపడతారు. కానీ ఆ మంటలు మీలోపలనే ఉన్నప్పుడు ఏం చేస్తారు? లోపల ఏర్పడ్డ ఈ భయంకరమైన మంటలను ఎలా ఆర్పాలి? సనాతన ధర్మానుభవాలను తెలిసిన ఋషులు ఇవ్వబడిన కొన్ని సాధనాలు కలవు. అవి సత్యం, ధర్మం, శాంతి మరియు ప్రేమ. వీటితో మీ హృదయాన్ని సంతృప్తి పరచుకోండి. మరియు “అగ్ని నిరోధకంగా” ఉపయోగించుకోండి.
ప్రస్తావనలు:
- సత్యసాయి వచనామృతం 26 వ భాగము, 27 వ అధ్యాయము
- సత్య సాయి వచనామృతం 11వ భాగము, 24 వ అధ్యాయము
- సత్యసాయి వచనామృతం 11 వ భాగము, అధ్యాయం 11
- నిత్య ఆలోచన (థాట్ ఫర్ ది డే) 26/05/2008
[Adapted from ‘Divine Inspirations Volume 1 – pg 107’]