త్రివిధం- వివరణ
త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః
కామక్రోధస్తథా లోభః తస్మాదే తత్రయం త్యజేత్!!
మోహము, క్రోధము మరియు దురాశలు నరకములనకు మూడు ద్వారములను ఏర్పరుస్తాయి. మరియు మనకు నాశనాన్ని కలిగిస్తాయి కాబట్టి వీటిని త్వరగా త్యజించాలి.
రావణాసురుడి పతనానికి కారణం మోహమే. అతని మొహం కారణంగా అతని బంధువులను, రాజ్యమైన లంక నాశనం జరిగింది. అదే అతనికి నరకప్రాయం.
విశ్వామిత్రుడు తన కోపాన్ని నియంత్రించుకొనడానికి కొన్ని వేల సంవత్సరాల పట్టింది. అతను తన అంతర్గత శత్రువులగు కామము, క్రోధము, మోహము, అహంకారము, దురాశ, అసూయ మరియు మాయ వీటన్నింటిని నియంత్రించినప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడు.
కామము:
హృదయములో కామము (తమ ఆనందం కోసం ఏర్పడిన కోరిక) ఉదయించినప్పుడు, దాని సేవకులగు క్రోధం, దురాశ, గర్వం, ఆడంబరం మరియు ద్వేషం కూడా ఆ బృందం లోనికి ప్రవేశించి ఆక్రమిస్తాయి. కామం రావణాసురుని నాశనం చేసింది. అతను గొప్ప పండితుడు మరియు శక్తివంతమైన వీరుడు. ఒక్క కామం అనే గుణము మనలో మంచి గుణాలను అణచివేసి మృగం స్థాయికి తేగలదు.
లోభము:– వీలైనంత త్వరగా డబ్బు సంపాదించాలనే దూరాశ. దీనివల్ల నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దురాచారాలను మనం చూస్తున్నాము.
క్రోధము: క్రోధము లేదా కోపము, జ్ఞానాన్ని నాశనం చేయగలదు. ఈ కోపానికి ప్రధాన కారణం అహంభావం లేదా తన స్వీయగుర్తింపు. ఇవన్నీ అజ్ఞానం కారణంగా ఏర్పడతాయి.
కనుక ఆత్మతత్వాన్ని అర్థం చేసుకునే లక్షణాన్ని పెంపొందించుకోవాలి. క్రోధం, మోహం, దురాశ మొదలైన చెడు గుణాలు, చెట్ల యొక్క మూలాల యందు కేంద్రీకృతమై ఆ చెట్టును నాశనం చేసే తెగుళ్ళ లాంటివి.
ఒకసారి మీరు భాహ్య ప్రపంచంలోని వస్తువులలో ఉన్న లోపాలను గుర్తిస్తే, అప్పుడు మీరు వాటిని స్వాధీనం చేసుకోవాలన్న కోరికను విడనాడుతారు.
వైరాగ్యం యొక్క సహజ లక్షణాన్ని గుర్తించడం సాధకునికి చాలా ముఖ్యమైనది. ఇది మీ మనసులను అంతర్ముఖం చేసుకోవడానికి మరియు దృష్టిని అంతర్గతీకరించటానికి సహాయపడుతుంది.
జీవితం ఒక పరిమితమైన సంస్థ వంటిది అని బాగా చెప్పారు. ఈ పరిమితిని కలిగి ఉన్నటువంటి సంస్థలో అపరిమితమైన వ్యాపారాన్ని చేయలేరు. అదేవిధంగా మన ప్రవర్తనపై మరియు కర్మలపై మనం పరిమితిని కలిగి ఉండాలి. అలాగే మన కోరికలపై కూడా నియంత్రణ ఉండాలి. స్వాధీనతాభావాన్ని వదులుకోవాలి. అప్పుడు మనకు ప్రపంచంలోని అందరికీ హాని కలగదు.
వివరణ:
స్వర్గం మరియు నరకం అన్నవి మన మనసు చేత సృష్టించ బడినటువంటివి అని బాబా వివరించారు.
కామము (ఆనందం కోసం కోరిక) మన హృదయాన్ని అక్రమించినప్పుడు దాని సేవకులైన కోపము, దురాశ, గర్వము, ఆడంబరము మరియు ద్వేషం కూడా ఈ సైన్యంలో చేరుతాయి. కామము గొప్ప పండితుడు, శక్తివంతుడు అయిననూ, ఫ రావణాసురుని నాశనం చేసింది.
కామం లేదా కోరిక అనగా ఏమి? ఒక వ్యక్తి యొక్క ఆలోచనలు ఒక వస్తువు పైననే, నిరంతరం కొనసాగుతూ ఉంటే, ఆ వస్తువును పొందాలి అన్న ధృఢమైన ఆలోచనల ప్రవాహానికి ఏదైనా అడ్డంకి వస్తే అనగా అది మనం పొందకపోతే, ఫలితంగా కోపము, నిరాశ, తిరుగుబాటు ధోరణి కలుగుతాయి. అప్పుడు కలిగే కోపం తుఫాను వలె విధ్వంసాన్ని సృష్టిస్తుంది.
అందువలన కోరిక తీరకపోతే వచ్చే నిరాశ కోపానికి దారితీస్తుంది. కోరిక తీరనప్పుడు అది ఇంకా తీవ్రతరమై, తీరని దాహం కలుగుతుంది. ఒక కోరిక కొన్నిసార్లు కొత్త కోరికలను పుట్టిస్తుంది. క్రమశిక్షణ పాటించని వ్యక్తిలో ఎప్పుడూ సంతృప్తి కనిపించదు. అతనికి కోరికలు తీరినప్పటికీ, ఇంకా ఏదో ఆనందం కావాలని కోరుకుంటాడు. కోరికల దాహం ఎక్కువవుతుంది. అతను పేదవాడైనచో, కొన్ని లక్షల రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా ధనం కావాలని తాహతహలాడుతాడు. ఇంకా పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించే వరకు అతను అశాంతిగా, సంతోషాన్ని కోల్పోయి ఉంటాడు. ఇటువంటి దురాశ మనశ్శాంతిని ఇవ్వలేదు.
ఈ మూడు గుణములు రాక్షస ప్రవృత్తికి మూలాధారమని ‘గీతా వాహిని’ లో బాబా చెప్పారు. ఈ కామకోదయోగంలో ఆత్మను నాశనం చేస్తాయి మరియు మనిషిలో రాక్షసత్వాన్ని పెంచుతాయి వైరాగ్యం, శాంతము, త్యాగము, బంధ విముక్తి, సమానత్వం మరియు పరిత్యాగం అని దైనిక గుణాల ద్వారా ఈ రాక్షస గుణాలను అధిగమించాలి.
కథ:
మనం చేయు కర్మలే స్వర్గం గానూ నరకంగా సృష్టించబడ్డాయి స్వార్థం మించిన నరకం లేదు. నిస్వార్థ ప్రేమను మించిన స్వర్గం లేదు. కొందరు మనుషులు ఒకసారి ఏ పరిస్థితులు నరకానికి దారి తీస్తాయి? మరియు ఏ పరిస్థితులు స్వర్గానికి దారి చూపిస్తాయి? అని తెలుసుకోవాలనుకున్నారు. ఎక్కడైతే అందరూ బాధలను. అభవిస్తుంటారో అది నరకమని, అందరూ ఆనందాన్ని పొందే చోటే స్వర్గమని అంటారు.
కనుక నరకం ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని ఆ బృందం మొదటి నరకానికి వెళ్ళింది. అక్కడ ఉన్న జనులందరూ బాధపడుతున్నారు. నరకంలో వారు చూసినది, వారిని చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకనగా నరకం వారికి చాలా గొప్ప ప్రదేశం గా కనిపించింది. అక్కడ ఆనందం కలిగించే ప్రతి వస్తువు పుష్కలంగా లభిస్తోంది. “మరి ఇక్కడ జనులు ఎందుకు బాధపడుతున్నారు?”అని ఆశ్చర్యపోయారు.
నరకంలో ఉన్న ప్రజలకి భోజన సమయం కావడంతో నరకవాసులంతా భోజనశాలకు వెళ్లారు. ఇక్కడ ఏమైనా భోజన సమస్య ఉన్నదా అని ఈ బృందం వారు విచారణ చేయుటకు వెళ్లారు. అక్కడ కనిపించినవి వారికి చెప్పలేనంత ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఎందుకంటే భోజనశాలలో, బల్లనిండా అనేక రకాల రుచికరమైన వంటకాలు ఉన్నాయి. ఆహారం లేకపోవడం, అలమటించడం వంటి సమస్యలకు ఇక్కడ తావు లేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా, అక్కడ భూమి కూడిన నరక వాసులంతా ఆకలితో చాలా కోపంగా కనిపించారు. ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ వాగ్వాదానికి దిగారు.
ఈ విధంగా గొడవలు పడుతున్న వ్యక్తులను ఈ బృందం వారు నిశితంగా పరిశీలించ సాగారు. నరకంలో ఉన్న వ్యక్తుల చేతుల్లో మోచేతికి కీళ్లు లేవని వారు గుర్తించారు. ఈ కారణంగా ఆహారం సమృద్ధిగాను, సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ వారు తమ చేతులను మంచి ఆహారాన్ని తీసుకొని లేక పోయారు. కనక వారంతా తీవ్రమైన ఆకలితో అలమటించిన. మరియు ఏమాత్రం ఆనందం పొందలేక పోయారు. ఎవరు ఈ పుష్కలంగా ఆహారాన్ని ఎందుకు ఇవ్వాలి? వారిని అలా ఆకలికి అనుమతించే విధంగా ఎందుకు చేయాలి? ఇంతటి క్రూరమైన పథకాన్ని ఎందుకు అమలు చేయాలి? అని అనుకుంటూ వారు స్వర్గవాసులు ఎలా ఉన్నారో చూడటానికి వెళ్లారు. అప్పుడు స్వర్గవాసులకు మధ్యాహ్న భోజన సమయము. స్వర్గము నరకంలానే ఉన్నప్పటికీ, అక్కడ అందరూ చాలా ఆనందంగా కనిపించారు. భోజనశాలా వద్ద అందరిలో తృప్తి ఆనందం వెళ్లి విరిసినట్లుగా ఆనందంతో కూడిన కేకలు వినిపించాయి. వీరందరికీ ఇంత సంతోషాన్ని కలిగించిన విషయం ఏమిటో అని ఆ బృందం వారు హడావిడిగా భోజనశాలకు చేరుకున్నారు. అక్కడ వారు ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారు. భోజనశాలలో బల్లపై నరకంలో లాగానే రుచికరమైన వంటకములతో నిండి ఉన్నది. అక్కడ ఉన్న ప్రజలంతా చక్కటి భోజనం ఉండటంవల్ల సంతోషంగా, సంతృప్తిగా కనిపించారు. వారంతా తృప్తిగా, ఆనందంగా తింటున్నారు. అప్పుడు ఆ బృంద సభ్యులు వారి చేతులు ఎలా ఉన్నాయో చూశారు. ఇక్కడ ఉన్న వారికి కూడా మోచేతి కీలు లేకుండా ఉండటానికి గమనించారు. వారు కూడా ముంజేతులను వంచలేకపోయారు. అయినప్పటికీ వారు అసంతృప్తి చెందలేదు. వారందరికీ ఎంతో రుచికరమైన పదార్థాలు అందించబడ్డాయి కనక, అవి ఇతరులకు సేవ చేయటానికి ఉద్దేశించినవి అని వారు అర్థం చేసుకున్నారు. అందుకని వారు ఆ బల్లపై ఉన్న ఆహారాన్ని సేకరించి, ఎదుటివారికి తినిపించారు. ప్రతి ఒక్కరూ ఇలా ఇతరులకు తినిపించినప్పుడు వారందరికీ ఆహారం పుష్కలంగా లభించింది. ఎవరు ఆకలితో లేరు. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది నిజమైన స్వర్గంగా మారింది. నరకంలో ఉన్నవారికి, ఇతరులకు సేవ చేయడానికే తమకు చేతులను బచ్చారని వారికి తెలియదు. వారి స్వార్ధపరులుగా ఉండి, తమ ఆకలి తామే తీర్చుకోవాలని ప్రయత్నించారు. కానీ వారి మోచేతికి కీళ్లు లేనందువలన అలా చేయలేకపోయారు. అందువల్లనే దుఃఖము, బాధ, ఆకలి మరియు కోపము. ఇదే వారికి నరకము.
ప్రశ్నలు:
- నరకానికి గల మూడు ద్వారములు ఏమి?
- మనకు కోపం ఎందుకు వస్తుంది?
- కోపాన్ని నియంత్రించుకోవాలంటే ఏం చేయాలి?
- భోగ భాగ్యాల కోసం ఏర్పడే కోరికలు సోమరితనానికి మరియు జబ్బులకు దారి తీస్తాయి. ఇది నిజమా?
- మంచి కోరికలు మరియు గొప్ప కోరికలు ఏవి?
- “దురాశ మరియు మోహము” ఎక్కడికి దారి తీస్తాయి?