సేవకుల పట్ల కర్తవ్యం
కొన్ని సంఘటనల ద్వారా మన ఇంట్లో సేవకుల నిజమైన స్థానం, వారితో మనకి ఉన్న సంబంధం, వారు మన జీవితంలో ఎలా ముడిపడి ఉన్నారు మరియు వారి పట్ల మన స్వంత బాధ్యతల గురించి తెలుసుకొని అర్థం చేసుకుందాం.
ఒక స్త్రీకి ఒక సమస్య ఎదురైనప్పుడు, ఆమె వెళ్లి శ్రీ సత్యసాయి బాబాను ఆ విషయంలో సలహా తీసు కోవాలనుకుంది. పుట్టపర్తికి వెళ్లేందుకు తనతో పాటు పనిమనిషి తో కలిసి సిద్ధమైంది. వారు బయలుదేరుతుండగా వేరే చోట చదువుతున్న తన కొడుకు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో, ఆ మహిళ తనతో పాటు పనిమనిషికి బదులు ఆమె తన కొడుకుతో సహా బాబా దర్శనానికి బయలు దేరి వెళ్ళింది. బాబా వారు ఆ తల్లి కొడుకులకు ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. వారు ఇంటికి తిరిగి వెళ్ళడానికి బాబా వారి అనుమతి తీసుకుని ప్రయాణమయ్యారు. బాబా వారికి తమ పట్ల ఉన్న దయ మరియు ప్రేమకు వారు చాలా సంతోషించారు. ఆవిడ ఇంటికి చేరుకోగానే, బాబా వారి నుండి తనని అత్యవసరంగా పుట్టపర్తికి రావాలని కోరుకుంటున్నారని తెలియజేసే టెలిగ్రామ్ ను చూసింది. కానీ ఆమె కొడుకు తన చదువుకు తిరిగి వెళ్ళవలసి ఉంది. కాబట్టి కొడుకు తన వెంట రాకపోవడంతో ఈసారి పనిమనిషిని తన వెంట తీసుకుని పుట్టపర్తికి బయలుదేరింది. వారు పుట్టపర్తికి చేరుకోని, ఇంత అర్జంటుగా తనను ఎందుకు పిలిచారని బాబా వారిని అడిగింది. బాబా ఇలా అన్నారు. “మీ పనిమనిషి కారణంగా నేను నిన్ను పిలిచాను… మీరు చివరిసారి అతనిని విడిచి పెట్టి వచ్చి నప్పుడు అతను ఎంత ఏడ్చాడో తెలుసా? అతను చాలా నిరాశను అనుభవించాడు. నేను నీకు, నీ కుమారునికి దర్శనం ఇచ్చినట్లే, అతనిని తృప్తిపరచుటకు, నన్ను దర్శించుటలో అతనికి సంతోషము కలిగించుటకు, నిన్ను మరల రమ్మన్నాను” అన్నారు. ఆమె తన సేవకుల యెడల తన బాధ్యత అర్థం చేసుకుని తన పట్టణానికి తిరిగి బయలుదేరింది.
బాబా, ఒక ఆయన ఇంటికి వచ్చినప్పుడు చాలా మంది వీఐపీలు బాబా వారిని చూసేందుకు అత్రుతగా అక్కడ గుమిగూడి ఉండేవారు. అయితే బాబా మొదటగా అక్కడ ఉన్న సేవకులను పలకరించిన తర్వాతే యజమాని మరియు అతిథులు వంటి వారికి దర్శనమిచ్చేవారని వారు చెప్పారు.
ఒకసారి, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తన కుటుంబంతో సహా పుట్టపర్తిలో బాబాను చూడాలనుకున్నప్పుడు, బాబా వారు ఆ కుటుంబాన్ని ఇంటర్వ్యూకి పిలిచారు. వారిని బాబా వారు అడిగిన మొదటి విషయం ఏమిటంటే, ‘ఇక్కడ మీరు నలుగురే ఉన్నారు. మీతో పాటు వచ్చిన మరొకరు ఎక్కడ ఉన్నారు?” అని. “వాళ్ళు మా కుటుంబ సభ్యులు కేవలం నలుగురే స్వామీ!” అన్నారు. అప్పుడు బాబా వారు, “అయితే నీ సేవకుడు కూడా నీ వెంట వచ్చాడు కదా? వెళ్లి అతనిని కూడా ఇంటర్వ్యూకి తీసుకురండి” అన్నారు. బాబా దృష్టిలో మనకూ మన సేవకులకూ తేడా ఏమీ లేదు. అంతేకాదు మరి మన ఇంట్లో ఉండే పిల్లి కుక్కల మీద కూడా బాబాకి ఉన్న ప్రేమ చాలా సార్లు చూపించారు. వారు మూగవారు కావచ్చు, కానీ ఆయన దృష్టిలో మన కుటుంబంలో వారు కూడా సభ్యులు మరియు భాగస్వాములు.