పరిచయం

శ్రీ రామకృష్ణ పరమహంస 19వ శతాబ్దంలో భారతదేశానికి చెందిన అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. ఆయన 1836లో ఒక సరళమైన బెంగాలీ గ్రామీణ కుటుంబంలో జన్మించారు. తన జీవితమంతా వివిధ రూపాల్లో ఆధ్యాత్మిక సాధనలు జరిపారు. ప్రతి వ్యక్తిలో పరమాత్మ యొక్క దివ్య స్వరూపం ఉన్నదని నమ్మారు. అన్ని వర్గాల ప్రజల యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి శ్రీ రామకృష్ణ పరమహంస మార్గాన్ని నిర్దేశించారు.
శ్రీ రామకృష్ణులు హిందూమతం పట్ల భారతీయుల విశ్వాసం సన్నగిల్లిన సమయంలో వారికి హిందూమతం యొక్క సౌందర్యం, గొప్పదనం మరియు బలాన్ని తిరిగి గుర్తుచేశారు. ఆయన కేవలం హిందూ మతాన్ని పునరుద్ధరించడానికే కాకుండా, ఇతర అన్ని మతాల విశ్వాసాలను కూడా పునరుద్ధరించడానికి జన్మించారు.
తన జీవిత కాలంలో శ్రీ రామకృష్ణులు హిందూ మతంతో పాటు ఇతర మతాల సాధన కూడా చేశారు మరియు అన్ని మతాలు సత్యమని గ్రహించారు. ఆయన అనుభవాలు ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా తన విశ్వాసాన్ని బలపరచుకొని తన దేవుణ్ణి అనుభూతి చెందగలడని వెల్లడించాయి. శ్రీ రామకృష్ణ జీవితం యొక్క సరైన అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా మతాలపై ఉన్న సందేహాలను పోగొట్టగలదు.
శ్రీ రామకృష్ణులు క్లిష్టమైన ఆధ్యాత్మిక సిద్ధాంతాలను సులభంగా మరియు స్పష్టంగా వివరించారు. ఆయన బోధనలు ప్రాచీన ఋషుల మాదిరిగా సంప్రదాయబద్ధంగా ఉన్నా, ఏ కాలానికైనా సమకాలీనంగా ఉంటాయి. ఆయన బోధనలు మరియు సిద్ధాంతాలను ఆయన అత్యంత ప్రముఖ శిష్యుడు స్వామి వివేకానంద కొనసాగించారు.
[Illustrations by Smt. Hema Satagopan]
References:
- శ్రీ రామకృష్ణ ది గ్రేట్ మాస్టర్ — రచయిత: స్వామి శారదానంద, అనువాదం: స్వామి జగదానంద, ప్రచురణ: శ్రీ రామకృష్ణ మఠం, మయిలాపూర్, చెన్నై–600 004.
- ది గోస్పెల్ అఫ్ శ్రీ రామకృష్ణ — అనువాదకుడు: స్వామి నిఖిలానంద (మద్రాసు: శ్రీ రామకృష్ణ మఠం, 1974)
- ది పాత్ డివైన్ — సత్య సాయిబాల వికాస్ మాగజైన్, ధర్మక్షేత్ర, మహాకాళి గుహల రోడ్, అంధేరి (ఈస్ట్), ముంబయి – 400 093
- ఆ షార్ట్ లైఫ్ అఫ్ శ్రీ రామకృష్ణ — ప్రచురణ: స్వామి తత్వవిదానంద, అధ్యక్షుడు, అద్వైత ఆశ్రమం, ఉత్తరఖండ్, హిమాలయాలు, ప్రచురణ విభాగం: కోల్కతా
- ది స్టోరీ అఫ్ రామకృష్ణ — ప్రచురణ: స్వామి బోధసరణానంద, అద్వైత ఆశ్రమం, ఉత్తరఖండ్, ప్రచురణ విభాగం: కోల్కతా

