శ్రద్ధ

Print Friendly, PDF & Email
శ్రద్ధ
“స్వీయ అవగాహన” అను అభ్యాసాన్ని ప్రారంభించుటకై శ్రద్ధ

(ఉపాధ్యాయుడు వ్యాయామాన్ని నెమ్మదిగా సూచిస్తాడు.ఆ సూచనలను అనుసరించండి. ఫుల్ స్టాప్ ల వద్ద నిలుపుతాడు.. అవసరమైతే నేపథ్యంలో మధువైన సంగీతాన్ని వినిపిస్తాడు.)

దశ 1:

సౌకర్యవంతమైన కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి. వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్లీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు మీ శరీరంలోని ఉద్రేకాలను తగ్గించండి. మీ కాలి వేళ్ళని సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. మీ పిక్క కండరాలను బిగించండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి.

మీ పై కాళ్లు మరియు తొడలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి.

మీ పొట్ట భాగంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను వెనక్కిలాగండి. వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి క్రిందికి తట్టండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. ఎడమవైపుకు చూడండి. ముందుకు తిరిగి కుడి వైపుకు చూడండి. ముందుకు చూడండి. మీ ముఖంలోని కండరాలను బిగించండి. వాటికి విశ్రాంతినివ్వండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం విశ్రాంతిని పొందినట్లుగా అనుభూతిని‌ పొందండి. ఉద్రేకాలు అన్నీ తొలిగిపోతాయి.

దశ 3:

మీరు వేసవి కాలంలో ఒక ఉద్యానవనంలో నడుస్తున్నారని ఊహించుకోండి. మీరు కళ్ళతో చూడలేరని భావించుకోండి, కానీ మీరు చాలా బాగా వినగలరు. ఆ అనుభూతిని మీరు పొందండి. మీ పాదాల క్రింద మృదువైన గడ్డి యొక్క స్పర్శానుభూతిని పొందండి. మీ ముఖంపై వీచే సున్నితమైన గాలి యొక్క స్పర్శను అనుభవించండి… సూర్యరశ్మి యొక్క వెచ్చదనాన్ని అనుభూతి చెందండి. చెట్లపై ఆకుల శబ్దాన్ని వినండి. ఇప్పుడు మీ యొక్క అంతరంగాన్ని తెలుసుకోండి.

దశ 4:

ఇప్పుడు మీ దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి.వ్యాయామం పూర్తయినది కనుక, మీ కళ్ళను తెరిచి విప్పార్చండి. మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.

(శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *