అవగాహన

Print Friendly, PDF & Email
అవగాహన
శ్రవణ నైపుణ్యాలను పెంపొందించుకుంటకై అవగాహన

(ఉపాధ్యాయుడు వ్యాయామాన్ని నెమ్మదిగా సూచిస్తాడు.ఆ సూచనలను అనుసరించండి. ఫుల్ స్టాప్ ల వద్ద నిలుపుతాడు.. అవసరమైతే నేపథ్యంలో మధువైన సంగీతాన్ని వినిపిస్తాడు.)

దశ 1:

సౌకర్యవంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ, నేల మీద స్థిరాసనంలో కానీ కూర్చోండి. మీ వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి.

మెల్లగా దీర్ఘశ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘశ్వాసను మళ్లీ మళ్ళీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు ఐదు ఇంద్రియాల గురించి తెలుసుకోండి…

గదిలోని గాలి యొక్క వాసన…

మీ నోటిలోని నీటి రుచి…

మీ పాదాల క్రింద నేల యొక్క దృఢత్వం. చర్మంపై గాలి యొక్క స్పర్శ. గదిలో శబ్దాలు వినండి. (ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు).

తర్వాత గది వెలుపల ఉన్న శబ్దాలను వినండి. ఈ వినికిడిని మీకు వీలైనంత వరకు విస్తరించండి.

దశ 3:

ఇప్పుడు మీ దృష్టిని తిరిగి తరగతి గదికి తీసుకుని రండి. వ్యాయామం పూర్తయినది కనుక, మీ కళ్ళను తెరిచి విప్పార్చండి.

మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.

(శ్రీ సత్య సాయి మానవతా విలువల బోధన ఆధారంగా)