పదవినోదం

Print Friendly, PDF & Email
పదవినోదం
లక్ష్యం:

ఈ ఆట ద్వారా పరిష్కారానికి అవసరమైన సమన్వయము మరియు సామాజిక నైపుణ్యాము మెరుగుపడతాయి.

సంబంధిత విలువలు:
  • సమస్య పరిష్కారం
  • నిర్ణయం తీసుకోవడం
  • సమయ పాలన
కావలసిన పరికరములు:

కాగితంతో చేసిన చిన్న కార్డులు.

గురువు ముందస్తుగా తయారుచేయావలసినది:
  1. గురువు తన తరగతిలోని పిల్లల సంఖ్యకు అనుగుణంగా కార్డులను సిద్ధం చేస్తాడు.
  2. ప్రతి కార్డుపై గురువు రామాయణంలోని ఒక పాత్ర పేరు వ్రాయవలెను. ఉదా:- (వాల్మీకి, వాలి, దశరథుడు, శత్రుఘ్నుడు, జానకి, శబరి, విభీషణుడు, మైథిలి, మండోదరి, కైకేయి, కౌశల్య)
ఆట ఆడు విధానము
  1. గురువు కార్డులను పూర్తిగా కాలపి, క్రమమును మార్చేసి, ప్రతి ఒక్క బాలబాలికలకు ఒక కార్డును ఇవ్వవలెను.
  2. గురువు తమ పిల్లలను రెండు గ్రూపులుగా విభజించి ఆట నిర్వహించవలెను.
  3. రెండు గ్రూపులలోని పిల్లలు తమ కార్డుపైనున్న పేరు ప్రకారం (నిఘంటువులో వలె) అక్షర క్రమంలో నిలబడవలెను.
  4. సాధ్యమైనంత తక్కువ సమయంలో అక్షర క్రమములో నిలచిన గ్రూపు గెలుచును.
    ఉదాహరణ: సమాధానం – కైకేయి, కౌశల్య, జానకి, దశరథుడు, మైథిలి, మండోదరి, శత్రుఘ్ను, శబరి, వాలి, వాల్మీకి, విభీషణుడు.
ఆటలోని వైవిధ్యత:

ఋషులు / సాధువులు, గొప్ప పురుషులు మరియు స్త్రీల పేర్లతో కార్లు తయారు చేయవచ్చును.

గురువులకు చిట్కాలు:

ఆట యొక్క క్లిష్ట స్థాయిని పెంచడానికి, ఒకే అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లతో కార్డులను తయారు చేయవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *