శ్రీ సత్య సాయి అష్టోత్రం

Print Friendly, PDF & Email
శ్రీ సత్య సాయి అష్టోత్రం
లక్ష్యం:

ఈ ఆట పిల్లలకు సరైన క్రమంలో మరియు ఆనందించే విధంగా సాయి అష్టోత్రాన్ని గుర్తుంచుకోవడానికి మరియు గుర్తుచేసుకోవడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది.

సంబంధిత విలువలు:
  • భక్తి
  • జ్ఞాపకశక్తి
  • అప్రమత్తత
  • కలసిమెలిసి ఉండుట
కావలసిన పరికరములు:

ఒక బంతి

గురువు ముందస్తుగా తయారుచేయావలసినది:

ఏదీ లేదు

ఆట ఆడు విధానము
  1. గురువు పిల్లలను గుండ్రంగా వరుస క్రమంలో నిలబెట్టావలెను. అందులో ఒకరికి బంతిని ఇవ్వవలెను.
  2. బంతితో ఉన్న పిల్లలు సాయి అష్టోత్రం నుండి మొదటి నామాన్ని జపించాలి మరియు ఇంకొక పిల్లల పేరును పిలుస్తూ బంతిని మరొక పిల్లలకు విసిరి వేయాలి.
    ఉదాహరణ: ఓం శ్రీ భగవాన్ సత్య సాయి బాబాయ నమః
  3. రెండవ బాల / బాలిక బంతిని పట్టుకుని వరుస క్రమములో తదుపరి నామము జపిస్తూ మరియు ఇంకొక పిల్లల పేరును పిలుస్తూ బంతిని మరొక పిల్లలకు విసిరి వేయాలి.
    ఉదాహరణ: ఓం శ్రీ సాయి సత్య స్వరూపాయ నమః అని జపిస్తుంది.
  4. మరొక బాల / బాలిక ఆ బంతిని పట్టుకొని మూడవ నామాన్ని జపించి మరొక బాలబాలిక పేరు చెప్పి బంతిని విసరవలెను.
  5. నిర్దిష్ట సమయములో, బాల / బాలికలు బంతిని విసురుతూ నామాలను సరైన క్రమంలో జపించే వరకు ఆట ఈ పద్ధతిలో కొనసాగుతుంది.
  6. తన తన దగ్గరకు బంతి వచ్చిన సమయంలో వరుసక్రమములోనున్న నామాన్ని గుర్తుకు తెచ్చుకోలేనప్పుడు పిల్లలు ఆట నుండి వెన్నతొలుగదరు.
గురువులకు చిట్కాలు:
  • గురువులు ఈ ఆట ద్వారా పిల్లల అప్రమత్తత, జ్ఞాపక శక్తి, మేధస్సును, పరీక్ష చేయవచ్చును
  • ఆటను మరింత ప్రభావవంతంగా మరియు ఆసక్తికరంగా చేయడానికి, పిల్లలను ఆట ప్రారంభించే ముందు అష్టోత్రం సెట్ వారీగా (సెట్టుకు 10 నామములు చప్పున) నేర్చుకోమని అడగవచ్చు. ఇది పిల్లలను పరీక్ష చేయడానికి ఉపయుక్తమైన చక్కటి సాధనంగా పనిచేస్తుంది.