బౌద్ధమతం

Print Friendly, PDF & Email
బౌద్ధమతం

క్రీస్తుపూర్వం 500 సంవత్సరాలలో గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించాడు.

గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర

కపిలవస్తు రాజైన శుద్దోధనుడు రాణి మాయాదేవి కుమారుడు సిద్ధార్థ గౌతముడు. చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ యుక్తవయసులో యశోధరను వివాహం చేసుకున్నాడు. అతనికి రాహుల్ అనే కుమారుడు కలిగాడు. రాజసౌధం లో పెరిగిన అతనికి లోకం లోని బాధలు, కష్టాలు,దుఃఖాలు తెలియవు. ఒకరోజు తన అంతఃపురం నుంచి బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఒక వృద్ధుడిని,రోగగ్రస్తుడిని, సన్యాసిని మరియు ఒక శవాన్ని చూసి సత్యాన్ని గ్రహించాడు. ఎవరికైనా అటువంటి స్థితి కలుగుతుందని తెలుసుకొని, విరక్తితో సత్యాన్వేషణ సాగిస్తూ భార్యా బిడ్డల్ని వదిలి అడవికి వెళ్ళిపోయాడు సన్యాసిగా మారి ఎన్నో సాధనలు చేసి నిరాహారంగా గడుపుతూ, చివరకు మరణావస్థకు చేరుకున్నాడు. ఒక పల్లెటూరి అమ్మాయి,అతనికి కొద్దిగా పాలు అన్నం ఇచ్చి ప్రాణాలు నిలిపింది. అప్పటి నుంచి ఉపవాసాలు నియమంగా, ప్రాణాయామం వంటి సాధనలు చేస్తూ తన తపస్సు కొనసాగించాడు.

ఏడు సంవత్సరాల తర్వాత గయలో బోధి వృక్షం కింద తపస్సు చేస్తూ జ్ఞానోదయం పొందాడు. బోధి వృక్షం కింద జ్ఞానోదయం కలిగింది కనుక అతన్ని బుద్ధుడు అని పిలిచారు. బౌద్ధులు గౌతముడు అనుభవించిన బాధలను మొదటి దశ గానూ సాధన దశను రెండవ దశ గానూ పేర్కొంటారు.

బుద్ధుడు దేశమంతా తన యొక్క సిద్ధాంతాలను బోధించారు. అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ధర్మాన్ని ప్రబోధించాడు. 45 సంవత్సరాల పాటు బుద్ధుడు దానశీలత గురించి సామాన్య జీవన విధానం గురించి, దయ, కరుణ ముఖ్యంగా అహింస బోధించాడు. తన 80 వ సంవత్సరంలో కుషి నాగర్ లో నిర్యాణం చెందాడు. వైశాఖ మాసం పౌర్ణమి రోజు బుద్ధుని జీవితంలో మూడు ప్రధానమైన ఘట్టాలు జరిగాయి.

బుద్ధుని జననం 2 జ్ఞానోదయం 3 నిర్వాణం అనగా మృత్యువు అందుకే ఆ రోజు బౌద్ధులకు పవిత్రమైన దినం

బౌద్ధ మతం

ఆసియా ఖండంలో ఎక్కువమందిదీనిని అనుసరించారు. బౌద్ధ మతం లోని నాలుగు ప్రధాన సూత్రాలు

  1. సర్వం దుఃఖమయం: జీవితం దుఃఖము తో కూడి ఉంటుంది
  2. సర్వం క్షణికం: అంతయూ తాత్కాలికము. క్షణ భంగురము
  3. సర్వం అశాశ్వతం: సారం లేనిది.
  4. నిర్వాణం శాంతం: నిర్వానమే శాంతి
నాలుగు మహా సత్యాలు బుద్ధుడు బోధించాడు
  1. జీవితంలో అన్ని బాధలే కలుగుతాయి.
  2. కోరికలే బాధలకు మూలం.
  3. శోకం నుంచి బయట పడే మార్గం కోరికలు అదుపు ఆశలపై అదుపు.
  4. తృష్ణ (మితిమీరిన ఆశలు). వీటిని తగ్గించుకునేందుకు ఎనిమిది మార్గాలు బోధించాడు
నిర్వా ణానికి 8 మార్గాలు:-
  1. సక్రమమైన అవగాహన;
  2. సక్రమమైన ఆలోచనలు;
  3. సక్రమమైన వాక్కు
  4. సక్రమమైన ప్రవర్తన
  5. సరైన విధంగా జీవించడం
  6. సరైన పద్ధతిలో సాధించటం
  7. సక్రమమైన బుద్ధి ఆలోచనలు ప్రవర్తన
  8. సరియైన ధ్యానం

బుద్ధుడు బోధించిన పంచశీల సూత్రాలు ఈ 5 సూత్రాలు సామాన్యులు సైతం ప్రతిరోజు పాటించాలని బోధించాడు

  1. అహింస
  2. సత్యం
  3. ఆస్తేయం అనగా దొంగతనం చేయరాదు
  4. బ్రహ్మచర్యం
  5. మత్తు పదార్థాలు సేవించరాదు

బౌద్ధ మత బోధనలు చాలా సులభతరం. దేవుని గురించి ఆత్మ గురించి బోధించలేదు. విగ్రహారాధన చెప్పలేదు.మనసే అన్నింటికీ మూలం. మనసును పవిత్రంగా ఉంచుకోవాలి. ఉద్రేక పూర్వకంగా మాట్లాడటం, హింసించడం, చేయరాదు. హిందువులు కూడా బుద్ధుని అంగీకరించారు. దశావతారాల్లో 9వ అవతారం గా పేర్కొన్నారు భారతదేశంలోని బౌద్ధమతాన్ని మాతృ మతంగా పేర్కొనవచ్చు ఆసియా దేశాల్లో ఎక్కువమంది బౌద్ధమతాన్ని స్వీకరించారు

బౌద్ధ మత ప్రార్థన

  • బుద్ధం శరణం గచ్చామి
  • ధర్మం గచ్చామి
  • సంఘం శరణం గచ్చామి
ధర్మచక్రం

బౌద్ధ మత చిహ్నం ధర్మచక్రం. ఇది ఎనిమిది భాగాలుగా ఉంటుంది. బౌద్ధ మతం లోని 8 నిర్వాణ సూత్రాలకు ప్రతీక మధ్యలో ఉండే చక్రము ధర్మానికి ప్రతీక.

బౌద్ధ మత గ్రంథాలు

పాలి (త్రిపిటిక) త్రీ అనగా మూడు పీటిక అనగా బుట్టలు అని అర్ధము. అవి

  1. వినయ పీఠిక : బుధవారం సన్యాసులు పాటించ వలసిన నియమాలు, వివరణలు.
  2. సూక్త పీఠిక: గౌతమ బుద్ధుని ఉపన్యాసములు
  3. అభిధమ్మ పీఠిక: గౌతమ బుద్ధుని బోధలు