బుద్ధ జయంతి యొక్క ప్రధాన వేడుకలు బౌద్ధ గయ లో జరుగుతాయి.
బుద్ధ పౌర్ణమి కి బౌద్ధులు అంతా బుద్ధునికి నివాళులు సమర్పించుటకు ప్రపంచం నలుమూలల నుండి తరలి వస్తారు.
ఆలయము, ఆలయం చుట్టూ ఆవరణ అంతా రంగురంగుల బౌద్ధ జెండాలతో శోభాయమానంగా అలంకరిస్తారు.
ప్రాతః కాలమున బౌద్ధ గురువులు ప్రార్థనలు చేసి, తదుపరి వూరేగింపు నిర్వహిస్తారు. అనంతరంమిఠాయిలు, తినుబండారముల పంపిణీ జరుపుతారు.
బుద్ధ జయంతి రోజు ప్రార్థనలు, ఉపన్యాసాలు,బుద్ధుని బోధనలు బౌద్ధ ఆరామాలలోను, మందిరములోనూ, బౌద్ధుల ఇళ్ళలోనూ మారుమ్రోగుతాయి.
ఆరోజు బౌద్ధులు తెల్లని వస్త్రాలను ధరిస్తారు.
ప్రజలు బుద్ధ విగ్రహానికి ధూపము, దీపము, పూలు, పండ్లు సమర్పిస్తారు. ఆ రోజంతా బుద్ధుని బోధనలు, ప్రసంగాలు వింటూ గడుపుతారు.
బౌద్ధ గయ లోని మహాబోధి ఆలయం రంగు రంగుల జెండాలతో, పువ్వులతో అలంకరించబడి, పండుగ వాతావరణంతో శోభిల్లుతుంది. జ్ఞానోదయం పొందిన భోధి వృక్షం క్రింద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి
కొత్త ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం లో బుద్ధ జయంతి సందర్భంగా ప్రజల సందర్శనార్థం బుద్ధుని మృతదేహాన్ని తీసుకుని వస్తారు.
బుద్ధ పౌర్ణమి నాడు ప్రజల కొరకై త్రాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. జంతువుల పట్ల ఎంతో దయ చూపిస్తారు.
బుద్ధ జయంతి చాలా ప్రశాంతంగా జరుపుకునే బౌద్ధుల పండగ.
బౌద్ధ పురాణం ప్రకారం బుద్ధుని భార్య యశోధరను, అతని మొదటి శిష్యుడు,సోదరుడు అయిన ఆనందను, అతని రథసారథి చన్నాను, అతని గుర్రం కంటకను, రాజ్యాన్ని త్యజించాడు. వీరంతా మళ్ళీ పవిత్రమైన బుద్ధ జయంతి రోజు జన్మించారని కొన్ని కథనాలు కలవు