చక్రవ్యూహ అంత్యాక్షరి

Print Friendly, PDF & Email
చక్రవ్యూహ అంత్యాక్షరి
ఉద్దేశ్యము:

వివిధ మతముల భావనలను, సారాంశమును అర్థం చేసుకొనుట.

అనుబంధ విలువలు:
  • జ్ఞాపకశక్తి
  • ఆసక్తి
  • ఏకాగ్రత
  • పట్టుదల, దృఢ నిశ్చయము
కావలసిన వస్తువులు:
  • ప్రింట్ చేసిన / ముద్రించిన చిత్రములు
  • పెన్ / పెన్సిల్
  • జవాబు కాగితములు
గురువు యొక్క ముందస్తు సంసిద్ధత

ఏమీ లేదు

ఏ విధంగా ఆడాలి?
  1. గురువు ముద్రించినటువంటి చిత్రమును ప్రతి ఒక్కరికి ఇవ్వాలి.
  2. అంత్యాక్షరి ఏ విధముగా ఆడాలో వివరించాలి. ఉదాహరణకు – BALARAM అనే పదము వచ్చినప్పుడు దాని తర్వాత వచ్చేటువంటి పదము ఏది?
  3. అంతకుమునుపు వచ్చినటువంటి పదము యొక్క చివరి ఒకటి రెండు ఒకటి లేదా రెండు లేదా మూడు అక్షరములను (BALARAM) జాగ్రత్తగా గమనించవలెనని చెప్పాలి. ఎందుకనగా ఈ అక్షరములతోటే తదుపరి పదము ప్రారంభం అవుతుంది కాబట్టి అని వివరించాలి.
  4. ఉదాహరణకు Mecca లో ‘M’, Amritsar లో ‘AM’, Ramayan లో ‘Ram’ అంత్యాక్షరి ఆడిన విధముగా.
  5. క్రింది ఇచ్చినటువంటి చక్ర వ్యూహ చిత్రము నుండి హిందు, సిక్కు, క్రైస్తవ, ఇస్లాము మతమునకు సంబంధించిన 20 పదములను గుర్తించవలెను. అవి ఆ మతమునకు సంబంధించిన పండుగలు, గ్రంథములు, వ్యక్తులు, భావనలు ఏవైనా కావచ్చు.

QURAN తో ప్రారంభమైన క్రింది చిత్రము నుండి వివిధ మతములకు సంబంధించిన 20 పదములను క్రమ రీతిలో కనుగొనండి.

సమాధానములు:
  1. QURAN
  2. NANAK
  3. KEVALIN
  4. LINGAM
  5. MARY
  6. YASHODA
  7. DAMODAR
  8. RADHA
  9. HARI
  10. RIG
  11. GOSPEL
  12. LANGAR
  13. RAMZAAN
  14. NANDALAL
  15. ALLAH
  16. HANUMAN
  17. NAMADEV
  18. DEVKI
  19. INDRA
  20. RAMAYAN

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *