Pyramid Perplexity-te

Print Friendly, PDF & Email
Pyramid Perplexity
ఉద్దేశ్యము:

వివిధ మతములు – భిన్నత్వములోని ఏకత్వము యొక్క అవగాహన.

అనుబంధ విలువలు:
  • పరిశీలన శక్తి
  • ఆసక్తి
  • జ్ఞాపకశక్తి
  • మతసామరస్యము
కావలసిన వస్తువులు:

ప్రింట్ చేసిన / ముద్రించిన పిరమిడ్ చిత్రము, జవాబును తెలుపు సంకేతములు, పెన్ / పెన్సిల్.

గురువు యొక్క ముందస్తు సంసిద్ధత:

ఏమీ లేదు

ఏ విధంగా ఆడాలి?
  1. గురువు ముద్రించినటువంటి చిత్రమును ప్రతి ఒక్కరికి ఇవ్వాలి.
  2. ఏ విధముగా ఆడాలో వివరించాలి.
  3. జవాబును తెలుపు సంకేతములు విడిగా ఇవ్వాలి.
  4. సంకేతములను ఉపయోగించుకుని, పదములను గుర్తించి, గడులలో నింపవలెను.
  5. పిరమిడ్ లో ఇచ్చినటువంటి అక్షరము “A” యొక్క స్థానమును గమనించి కూడా సమాధానమును పొందవచ్చు.
  6. గురువులు మొదటి ప్రశ్న ప్రణవ మంత్రము సమాధానము – ‘AUM’ అని, ఉదాహరణగా చెప్పవచ్చు.

క్రింద ఇచ్చిన ఆధారాల అనుగుణంగా వివిధ మతములకు సంబంధించిన 10 పదములతో పిరమిడ్ గడులను పూరించండి. ప్రతి ఒక్క పదములోను “A” అక్షరము ఉండును.

ఆధారములు:
  1. ప్రణవ మంత్రము
  2. దీని అర్థము విజేత
  3. ఇస్లాం మతం యొక్క ప్రార్ధన
  4. సిక్కు మతముకు సంబంధించిన సార్వజనిక వంటశాల
  5. బుద్ధుడు తన మొదటి ప్రబోధన గావించినటువంటి ప్రదేశము
  6. జీసస్ ప్రబోధనల యొక్క చిన్న కథల సంకలనము
  7. హిందూ మతమునకు సంబంధించిన గ్రంథము
  8. జొరాస్ట్రియన్ల దైవము
  9. భజగోవిందంను రచించిన వారు
  10. మహావీర్ జైనుల ——–
సమాధానములు:
  1. AUM
  2. JINA
  3. NAMAZ
  4. LANGAR
  5. SARNATH
  6. PARABLES
  7. UPANISHAD
  8. AHURA MAZDA
  9. ADI SHANKARA
  10. TIRTHANKARAS