బంక మట్టి(క్లే మోడలింగ్)
బంక మట్టి(క్లే మోడలింగ్)-గణేశ
వినాయకుడు పుట్టినరోజున జరుపుకునే పండుగ వినాయకచవితి. గణేషుని విగ్రహాలను పది రోజులు లేదా అంతకంటే తక్కువ రోజులు ఇళ్లలో ను బహిరంగ ప్రదేశాల్లోను ఉంచి పూజించిన, తరువాత విగ్రహాన్ని నీటి లో నిమజ్జనం చేస్తారు. దీనిని విసర్జన్ అంటారు.
ఈ మధ్య కాలం లో మతపరమైన విశ్వాసాలతో పాటు మన పర్యావరణాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు గ్రహిస్తున్నారు.
గణేశ విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసి వాటికి మెరుపులు అద్దేవారు. ఆ విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితం అవుతుంది.
మట్టి లేదా కాగితపు గుజ్జుతో గణేశ విగ్రహాలను తయారు చేయడం మంచి ఆలోచన. దీనివలన మన నీటి వనరులను కాపాడబడుతాయి. మన ఆరోగ్యం కూడా రక్షించబడుతుంది. జలచరాలు మరియు మొక్కలు నీటిలో సంతోషంగా వృద్ధి చెందుతాయి.
శుభవార్త ఏమిటంటే వినాయకుని విగ్రహాలను మన ఇళ్లలోనే మట్టితో తయారు చేసుకోవచ్చు. మనం దీన్ని సులభంగా ఎలా తయారు చేయాలో తెలియచెప్పే వీడియో ఇక్కడ ఉంది. కేవలం మట్టితో మన ఇంట్లోనే మనోహరమైన గణేశ విగ్రహాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో దశలవారీగా వివరిస్తుంది!