వెనకనుండి లెక్కించు

Print Friendly, PDF & Email
వెనకనుండి లెక్కించు
లక్ష్యం:

పేరు లో ఉన్నట్లే వెనుకనుండి లెక్కించుట ఒక బృంద ఆట. దీనిలో బాలవికాస్ లో నేర్చుకున్న విలువలను మొదటినుండి కాక క్రింద నుండి వరుసలో చెప్పాలి. ఈ విధంగా వారి దృష్టిని కేంద్రకరించుట ద్వారా సందేహించుట, వెనుకడుగు వేయుట అనే అలవాటు తగ్గుముఖం పడుతుంది. వారి లెక్కింపు శక్తి మరియు జ్ఞాపక శక్తి పెంపొందుతుంది.

సంబంధిత విలువలు:
  • ఏకాగ్రత
  • జ్ఞాపక శక్తి
  • అప్రమత్తత
  • ఆత్మ విశ్వాసము
  • సమస్యలు పరిష్కరించుట
కావాల్సిన సామాగ్రి:

పెన్ను, పేపరు

గురువు ముందస్తు తయారీ:

గురువు చిన్న కాగితం ముక్కలలో వరుసలో క్రింద పేర్కొన్న విధంగా రాస్తారు.

  • చతుర్విధ పురుషార్ధాలు
  • చతుర్వేదాలు
  • 4 యుగాలు
  • పంచ పాండవులు
  • పంచ ప్రాణాలు
  • పచ్చ కోశాలు
  • షడ్రిపులు
  • దశావతారములు మొదలైనవి.
ఎలా ఆడాలి
  1. చిన్నారులను జతలు జతలుగా ఏర్పడమని చెప్పాలి.
  2. ఒక ఉదాహరణతో ఎలా ఆడాలో వివరించాలి.
  3. మొదట ఒక జత పిల్లలను పిలిచి – చతుర్విధ పురుషార్ధాలు అన్ని రాసి ఉన్న పేపర్ ఇవ్వాలి.
  4. ఒక చిన్నారి ధర్మ, అర్ధ, కామ, మోక్షాలని చెప్పాలి.
  5. జతలో ఉన్న ఇంకో చిన్నారి మోక్ష, కామ, అర్ధ ధర్మము అని చెప్పాలి.
  6. అలా జతలోని ఇద్దరూ చెబితే పాయింట్లు వస్తాయి.
  7. వారు చెప్పలేకపోతే ఇంకో జత పిల్లలకు అవకాశం వస్తుంది.
  8. ఇలా అందరు పిల్లలతో చేయించవచ్చు.
మార్పులు, చేర్పులు:

గ్రూప్ – 1 పిల్లలకు, త్రిమూర్తులు, త్రిగుణములు… ఇలా ఇవ్వవచ్చు.

గురువులకు సూచనలు:

ఈ ఆట తరచుగా ఆడిస్తే పిల్లలకు సులభంగా, సరదాగా బాలవికాస్ అంశాలు గుర్తుంటాయి.