హరిర్ దాతా శ్లోకము – కార్యకలాపాలు

Print Friendly, PDF & Email
ఆరోగ్యవంతమైన ఆహారం మరియు జంక్ ఫుడ్ మ్యూజికల్ ఛైర్స్ ఆట

గురువు ఆట మొదలు పెట్టుటకు ముందు పిల్లలతో ఆహారపు అలవాట్లు గురించి చర్చించాలి.

ప్రధానాంశాలు క్రింద పేర్కొన్న విధంగా:

  1. భోజనం చేయడానికి ముందు మీరు చేతులను శుభ్రంగా కడగనట్లయితే, మురికి, చేతి ద్వారా కడుపులోకి చేరి ఆరోగ్యం జబ్బు చేస్తుంది (దెబ్బ తింటుంది).
  2. మీరు దృఢత్వం మరియు మంచి ఆరోగ్యవంతులు. ఎందుకనగా మీకు మీ అమ్మ మంచి మరియు శుభ్రమైన ఆహారం పెడుతుంది కనుక.
  3. అమ్మ మీకు శుభ్రమైన వేడినీటిని త్రాగడానికి ఇస్తుంది.
  4. చక్కగా శుభ్రంగా ఉంటే మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు.
  5. మనం అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినాలి.
  6. మనం జంక్ ఫుడ్స్ ని, ఫాస్ట్ ఫుడ్స్ (కొవ్వు పదార్థాలు) ని నిరోధించాలి.
  7. మనం తినడానికి ముందు ఆహారాన్ని దేవునికి సమర్పిస్తే అది ప్రసాదంగా మారుతుంది.
  8. పండ్లు, కూరగాయల పటాన్ని చూపించి, వివరించి అందులోని మంచి ఆహార విలువలను తెలపాలి.

కావలసిన సామాగ్రి: చార్ట్ , స్కెచ్/ మార్కర్ , కుర్చీ, మ్యూజిక్ యంత్రం (గురువు భజనలు కూడి పాడవచ్చు).

సన్నాహక వస్తువులు: ఒక చార్ట్ ని 4 సమభాగాలుగా కత్తిరించాలి. వాటిపై ఆరోగ్యకరమైన ఆహారం పేర్లు మరియు జంక్ ఫుడ్స్ పేర్లు వ్రాయాలి.

ఉదాహరణ:

  • ఆరోగ్యకరమైన ఆహారం: కూరగాయలు, సూప్, పాలు, పెరుగు, పండ్ల ముక్కలు, రాజ్మా పప్పుల అన్నం, రోటి, మొలకెత్తిన విత్తనాలు, కొబ్బరి మొదలైనవి.
  • జంక్ ఫుడ్స్: బర్గర్, పీజా, నూడల్స్, పానీయాలు (coco cola etc.) మొదలైనవి.

ఈ ఆట మ్యూజికల్ ఛైర్స్ కు సరి సమానముగా నుండును. ఈ ఆటలో ఎంతమంది విధ్యార్థులు ఉంటారో అన్ని కుర్చీలు ఏర్పాటు చేయాలి. ప్రతీ కుర్చీ క్రింద ఆరోగ్యకరమైన ఆహారం పేరు, మరియు కొన్నింటి క్రింద జంక్ ఫుడ్స్ పేరు రాసి అతికించాలి. పిల్లలు పరిగెట్టడం మొదలు పెట్టాలి. పాట మొదలవగానే పరిగెట్టాలి, పాట ఆగినప్పుడు పిల్లలు కుర్చీలో కూర్చోవాలి. జంక్ ఫుడ్స్ పైన కూర్చున్న విద్యార్థి ఓడిపోయినట్లు ఆట నుంచి బయటకు రావాలి. మళ్ళీ ఆట కొనసాగుతుంది. చివరగా మిగిలిన వారు గెలుపొందిన వారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: