సానుభూతి

Print Friendly, PDF & Email
సానుభూతి
ఉపాధ్యాయుడు ఇస్తున్న సూచనలను అనుసరించండి….
పారే నీటి సవ్వడి, ప్రకృతి ధ్వనులు,నీటిలో తిమింగలములు నీటిలో చేయు ధ్వనులు మరియు ఇంపైన సంగీతమును వినండి.

(మీకు అవసరమైతే) నేపథ్యంలో మృదువైన సంగీతాన్ని వినటానికి పెట్టండి..

ఒకవేళ అనుకూలంగా ఉంటే మధ్యలో ఒక అడుగు స్థలం ఉండేలాగా వృత్తాకారంలో పిల్లల్ని కూర్చోనివ్వండి. అలా లేనిచో వారిని కుర్చీలో కానీ, సుఖాసనంలో కానీ కూర్చోమనండి.

వెన్నెముకను,తలను నిటారుగా ఉంచండి.

మెల్లగా, దీర్ఘంగా శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి.

కళ్ళు మూసుకోండి, మీకు అసౌకర్యంగా ఉంటే నేలవైపు చూడండి.

మళ్లీ దీర్ఘ శ్వాసను తీసుకోండి.

నిశ్శబ్దంగా సంగీతాన్ని వినండి.

మీకు తెల్సిన వారు ఎవరైనా ఇబ్బందికి గురవుతుంటే, వారి గురించి ఆలోచించండి.

మనసులో వారు పడుతున్న బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

వారిని ఉన్నత స్థాయికి తెచ్చుటకు మీరు ఎలా సహాయపడగలరో ఆలోచించండి.

ఎప్పుడైతే ఇతరులు బాగు కొరకై మీరు సహాయపడతారో అప్పుడు మీరు కూడా బాగుంటారు.

కొద్దిసేపు తర్వాత …….. ఇప్పుడు నేను చిన్నగా చేసే గంటల శబ్దంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి, మీ పక్క కూర్చున్న వారిని చూసి నవ్వండి.

[సత్య సాయి మానవతా విలువల విద్యా బోధన ఆధారంగా – చక్కని నడత మరియు భావోద్వేగ అక్షరాస్యత అభివృద్ధి కొరకు పాఠ్య ప్రణాళిక -కరోలే ఆల్డర్మాన్]