కృతఙ్ఞత

Print Friendly, PDF & Email
కృతఙ్ఞత
నేను ఒక వస్తు రూపమును మనస్సులోనే చిత్రీకరించి మనో నేత్రాలతో చూసుకొనుట ద్వారా తెలుసుకున్న మంచి విషయాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

విశ్వజ్యోతి

(పేరాగ్రాఫ్ లు మరియు పులిస్టాప్ ల మధ్య విరామం ఇవ్వండి)

దశ 1:

సౌకర్యం వంతమైన స్థితిలో కుర్చీ మీద కానీ లేదా నేల మీద స్థిరాసనంలో కూర్చోండి.

వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మెల్లగా దీర్ఘ శ్వాసను తీసుకుని, తిరిగి మెల్లగా బయటకు వదలండి. కొద్దిగా విశ్రాంతి తీసుకుని, దీర్ఘ శ్వాసను మళ్లీమళ్లీ తీసుకోండి.

దశ 2:

ఇప్పుడు శరీరంలోని ఉద్రిక్తతను తగ్గించండి. మీ కాలు వేళ్ళను సాగదీయండి. ఆపై వాటికి విశ్రాంతినివ్వండి. పిక్క కండరాలను బిగించి, ఆపై వాటికి విశ్రాంతి ఇవ్వండి. ఆ తర్వాత మీ పైకాళ్లు మరియు తొడలలోని కండరాలను బిగించండి. ఆ తర్వాత వాటికి విశ్రాంతినివ్వండి. మీ కడుపు కండరాలను లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. భుజాలను వెనక్కి లాగండి. మళ్లీ వాటికి విశ్రాంతినివ్వండి. మీ భుజాలను పైకి కిందికి తట్టండి. ఇప్పుడు మీ ఎడమ వైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. తిరిగి కుడివైపు చూడండి. మళ్లీ ముందుకు చూడండి. ఇప్పుడు మీ ముఖం యొక్క కండరాలను బిగించండి. తిరిగి వాటికి విశ్రాంతినివ్వండి.మీ శరీరం మొత్తం విశ్రాంతి పొందినట్లుగా అనుభూతి పొందండి. అప్పుడు మీలోని ఉద్రిక్తతలన్నీ తగ్గిపోయి మీరు మంచి అనుభూతిని పొందుతారు.

దశ 3:

ఇప్పుడు మీరు సముద్రతీరంలో షికారు చేస్తున్నారని ఊహించుకోండి. మీ అడుగులు సూర్యుని నుండి వెచ్చదనాన్ని మరియు మీ చెంపలు చల్లగా వీస్తున్న గాలిని అనుభూతిని పొందుతున్నాయి. మీ కింద ఉన్న మృదువైన, వెచ్చని ఇసుకను అనుభూతి చెందండి. అన్నీ చాలా అందంగా ఉన్నాయి మరియు మీరు చాలా సంతోషంగా ఉన్నారు. అలలు సముద్ర తీరానికి వ్యతిరేకంగా మెల్లగా తరంగాలుగా వస్తున్నప్పుడు వాటిని చూడండి. మీ చుట్టూ ఉన్న అన్ని అందంగా ఉన్నాయి. ఇప్పుడు మీకు సంతోషాన్ని కలిగించే అన్ని విషయాల గురించి ఆలోచించండి. డబ్బు ఖర్చు చేయని విషయము మరియు ప్రకృతిలోని వనరులను ఉపయోగించని అన్ని విషయాల గురించి ఆలోచించండి. మీరు ఇష్టపడే వ్యక్తుల గురించి ఆలోచించండి. మీరు, మీ కుటుంబము, మీ స్నేహితులు, మీ ఉపాధ్యాయులు, ఈ ప్రేమ కోసం, జీవితంలోని అందమైన విషయాల కోసం మీ ఆశీర్వాదములను లెక్కించండి.

మీ వద్ద ఉన్న వాటికి ఆనందాన్ని మరియు కృతజ్ఞతను అనుభూతి చెం దండి.

దశ 4:

ఇప్పుడు తిరిగి మీ దృష్టిని తరగతి గదిలోనికి తీసుకురండి. నీ కళ్ళను విప్పార్చండి. ఈ వ్యాయామం పూర్తి అయినది కనుక మీ పక్కన ఉన్న వారిని చూసి నవ్వండి.

[శ్రీ సత్య సాయి మానవతా విలువల విద్యాబోధన ఆధారంగా.]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: